చిత్తూరు

ఇకపై శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మార్చి 1: తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. విజయవాడలో జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణ వాయుదూత్ విమానాల నుంచి నేడు అంతర్జాతీయ విమనాల రాకపోకలకు ఎదగడానికి శ్రీ వేంకటేశ్వరస్వామిపైన అపారమైన భక్తితో భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి రావడమే కారణం. గతంలో కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎంపి చింతామోహన్‌లు సుమారు 195 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాదిరాయి వేశారు. నేడు ప్రధాని మోదీ, సి ఎం చంద్రబాబు నాయుడు చేతులగా ఈ విమానాశ్రయంలో ప్రతి రోజు 8 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో ప్రయాణించేవారిలో 80 శాతం మంది శ్రీవారి భక్తులే కావడం గమనార్హం. కాగా మే నెల నుంచి హైదరాబాదు, ముంబై మీదుగా కువైట్‌కు విమానాలు రాకపోకలు సాగనున్నాయి. అలాగే బ్యాంకాక్, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక దేశాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈదేశాలకు తిరుపతి విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడపడానికి ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. అలాగే రాయలసీమ జిల్లాల నుంచి కువైట్‌కు వెళ్లే వారికి ఇకపై తిరుపతి విమానాశ్రయం మరింత ఉపయోగకరంగా మారనుందనడంలో సందేహంలేదు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నాగలాపురం, మార్చి 2: ఆగి ఉన్న బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు మృతిచెందిన సంఘటన నాగలాపురం మండలం కారణి వద్ద చెన్నై-పుత్తూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వద్ద గురువారం రజిగింద. చెనర్నై పుత్తూరు రహదారిపై జరిగింది. పోలీసులు కథనం మేరకు కారణి ఎస్‌సి కాలనీకి చెందిన వెంకటెష్ (27) ఎల్లయ్య (30) సొంతపనిపై సమీప పట్టణమైన ఊతుకోటకు వెళ్లి తిరిగి కారణి వస్తుండగా కారణి స్పీడ్ బ్రేకర్ వద్ద ఎవరో బైక్ ఆపి మూత్ర విసర్జనకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్ బైక్ వేగంగా ఆగిఉన్న బైక్‌నుఢీకొంది. ఈఘటనలో బైక్ డ్రైవింగ్ చేస్తున్న వెంకటేష్ బైక్‌పైనుంచి ఎగిరి సమీపంలోఉన్న సిమెంట్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న ఎల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని పోలీసులు చికిత్స కోసం ఊతుకోట ఆసుపత్రికి తరలించారు. నాగలాపురం ఎస్‌ఐ మునస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి శవాన్ని పోస్టుమార్టంకోసం సత్యవేడు పిహెచ్‌సికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

ఊపందుకొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

*పట్టు నిలుపు కోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్సీలు ప్రయత్నాలు
* ఈసారి పాగా వేయాలని అధికార పార్టీ వ్యూహం

చిత్తూరు, మార్చి 2: తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు , ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండంతో ప్రచారాలు ఊపందుకొన్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి పట్టు నిలుపుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్సీలు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. అయితే ఈసారి రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. ముఖ్యంగా అధికారపార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మాకంగా తీసుకుని మంత్రులను రంగలోకి దింపింది. తూర్పు రాయలసీమ పట్ట్భద్రుల స్థానానికి 14మంది, టీచర్ల స్థానానికి తొమ్మిది మంది ఎన్నికల బరిలోఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టిడిపి, పీడిఎప్, కాంగ్రెస్ మద్దతుదారులు రంగంలో ఉన్నారు. పట్ట్భద్రుల స్థానానికి కాంగ్రెస్ మద్దతుదారుడైన రామచంద్రారెడ్డి, టిపిపికి చెందిన వి పట్ట్భారామిరెడ్డి, పీడిఎఫ్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, దన్నారపు మస్తాన్ రావు(బహుజన డెమెక్రటిక్ ఫ్రంట్) కిరణ్ కుమార్ యాదవ్ (ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి) స్వతంత్రులైన డాక్టర్ సుభాష్ రాజు, పి వెంకటరమణ, నాగబ్రహ్మానందాచ్చారి, కోటేశ్వరరావు, కడియం రామయ్యయాదవ్, కె నారాయణరెడ్డి, సొమిరెడ్డి, కరీముల్లా, రాజేష్ రాయల్‌లు పోటీ పడుతుండగా, టీచర్ల స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా ఆనందనాయుడు, చదలవాడ సుచరిత, కృష్ణయ్య, వెంకటసుధాకర్‌రెడ్డి, రామిరెడ్డి, రామయ్య, టిడిపి మద్దతుదారుడిగా వాసుదేవనాయడు, పీడి ఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ విఠపుబాలసుబ్రహ్మణ్యం, బహుజన డెమెక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా అంబూరి సుబ్రహ్మణ్యంలు బరిలో ఉన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేసారు. ప్రస్తుతం ఉపాధ్యాయ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న విఠపు బాలసుబ్రహ్మణ్యం రెండు పర్యాయాలు వరుసగా విజయం సాధించి మూడో సారి రంగంలోకి దిగారు. పట్ట్భద్రుల స్థానానికి శ్రీనివాసరెడ్డి రెండువ పర్యాయం బరిలో కొనసాగుతున్నారు. వీరు యుటిఎఫ్‌తోపాటు ఎస్‌టియి, ఇతర ఉపాధ్యాయ సంఘాలు , వామపక్షాలు, పలు ప్రజా సంఘాల మద్దతు ఇస్తున్నాయి. తాజాగా వైకాపానేత జగన్ కూడా పీడిఎఫ్ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు రంగంలోకి దిగి వీరికి విజయానికి కృషి చేస్తున్నారు. వీరి తరపున వామపక్షాలు , ఇతర ప్రజాసంఘాలు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సారి ఈ రెండు స్థానాల్లో పాగా వేయాలన్న దృక్పథంతో అధికార పార్టీ వ్యూహాలను పన్నుతుంది. ఇందుకోసం బలమైన నేతలను ఈసారి రంగంలోకి దింపింది. ప్రస్తుతం ఉపాధ్యాయ స్థానానికి మదనపల్లి ఉప విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న వాసుదేవ నాయుడును, పట్ట్భద్రుల స్థానానికి నెల్లూరుకు చెందిన పట్ట్భారామిరెడ్డి టిడిపి అభ్యర్థులుగా తలపడుతున్నారు. వీరి విజయం కోసం రాష్ట్ర మంత్రులైన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, నారాయణ, గంటా శ్రీనివాస్ రంగంలోకి దిగారు. వీరు జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాలతోపాటు, బిజెపి, టిడిపి పార్టీల శ్రేణులతో మంతనాలు చేస్తూ వ్యూహ రచనలు చేస్తున్నారు. అలాగే మండల స్థాయిలో ఉన్న ఓటర్ల వివరాలను సేకరిస్తూ వారిని తమ పైపు మలుచుకొనే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మండల స్థాయి నేతలకే ఈ బాధ్యతలను అప్పగించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో టిడిపి నేతలు ప్రచారాలను చేట్టారు. ఈ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తుడంతో నేతలు పలురకాలుగా ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు.

మధుమేహానికి మందిస్తానని
మొత్తం దోచేసిన మాయలేడి
* తిరుమల కొండపై మహిళా భక్తురాలి నుంచి 19సవర్ల బంగారు నగలు చోరి
* భక్తురాలి పరిస్థితి విషమం

తిరుపతి, మార్చి 2: మాటమాట కలిపింది. మంచి మాటలతో నమ్మించింది. తాను మధుమేహానికి మందిస్తానని చెప్పి, భర్తను దూరంగా పంపించి భార్యకు మత్తమందు ఇచ్చి ఆమె వద్ద ఉన్న 19 సవర్ల బంగారు నగలు, రూ. 500 నగదుతో ఓ మాయలేడి పరారైంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తురాలిని మోసం చేసిన సంఘటనపై అటు టిటిడి అధికారులు, ఇటు పోలీసులు నిందితురాలి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా మత్తుమందు తిన్ని మహిళ అపస్మార స్థితికి చేరుకుని ప్రస్తుతం తిరుమలలోని అశ్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురువారం తిరుమలలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువన్నామలైకి చెందిని శాంత, సుబ్రహ్మణ్యం దంపతులు శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమలకు చేరుకున్నారు. సీనియర్ సిటిజన్ ప్రవేశ ద్వారం ద్వారా ఆలయంలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ జరిగే ప్రాంతంలో ఉన్నవారిని గుర్తు తెలియని ఓ మహిళ కలిసి పరిచయం పెంచుకుంది. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆమహిళ అక్కడ నుంచి వెళ్లిపోయింది. రాత్రి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఆ దంపతులు నిద్రించారు. గురువారం ఉదయం వారి వద్దకు చేరుకున్న ఆమె వారిని వరహాస్వామిని దర్శించుకుని రావాలని చెప్పడంతో అప్పటికే ఆమెను పూర్తిగా నమ్మిన శాంత, సుబ్రహ్మణ్యం దర్శనానంతరం తిరిగి అక్కడకు చేరుకున్నారు. తాను మధుమేహానికి మందు ఇస్తానని నమ్మించిన ఆమె శాంతకు టిఫిన్ తెచ్చి ఇచ్చి, సుబ్రహ్మణ్యంను టిఫిన్ చేసి రమ్మని పంపించింది. ఆయన అటు వెళ్లగానే ఆ మహిళ ఓ ఆకులో తాను కలిపిన పసరును ఇచ్చింది. దీనిని తిన్న శాంత సృహతప్పి పడిపోయింది. ఇదే అదునుగా భావించి ఆమె మెడలోని తాళిబొట్టు సరుడు, కమ్మలు మొత్తం 19 గ్రాముల బంగారు నగలతో, రూ. 500 తీసుకుని ఉడాయించింది. టిఫిన్ చేసి వచ్చిన సుబ్రహ్మణ్యం తన భార్య పరిస్థితిని చూసి గొల్లుమన్నాడు. అపస్మారక స్థితిలోవున్న తన భార్యను తోటి భక్తుల సహాయంతో అశ్విని ఆస్పత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న తిరుమల క్రైం పోలీసులు మాయలేడి కోసం గాలింపు చేపట్టారు. కాగా తిరుమలలో పట్టపగలే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంపై పోలీసులతో పాటు టిటిడి అధికారులు తీవ్రంగా పరిగణిస్తుండగా భక్తులు ఆందోళన చెందుతున్నారు.
తిరుపతిలో హైకోర్టును ఏర్పాటుచేసి రెండో రాజధానిగా తీర్చిదిద్దాలి
* పిసిసి అధికార ప్రతినిధి రాంభూల్ రెడ్డి డిమాండ్
తిరుపతి, మార్చి 2: నవ్యాంధ్రప్రదేశ్‌లో ఒకేచోట అధికార కేంద్రీకరణ జరగకుండా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో హైకోర్టును ఏర్పాటు చేసి, తిరునగరినే రెండో రాజధానిగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఇప్పటికే కరువుకోరల్లో చిక్కి అల్లాడుతోందని అన్నారు. ఈపరిస్థితిలో మార్పుతేవాలన్నా, ఇక్కడి ప్రజల జీవన పరిస్థితి మారాలన్నా ఏపిలో రెండు రాజధానులు ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమన్నారు. ఉత్తరాన విశాఖలో ఉక్కుకర్మాగారంతోపాటు, కోస్తాలో రాజధాని ఉందని ఏదీలేకుండే కరువుకోరల్లో చిక్కి రాయలసీమ విలవిల్లాడుతోందని ఆయన వివరించారు. తమ డిమాండ్ అసహజం, అసాధారణం కాదని దేశంలోని అనేక రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయని అలాగే హైకోర్టు సైతం రాజధానిలోనే కాకుండా మరో ప్రాంతంలో ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇందుకు కర్ణాట, హిమాచల ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,కేరళ, ఒరిస్సా, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లకు రెండు రాజధానులు ఉన్నవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. అలాగే చిత్తూరు జిల్లాలో అతిపెద్ద దేవస్థానం టిటిడి ఉంటే ఎండోమెంట్ ట్రిబ్యునల్ విశాఖలో ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో పిసిసి కార్యదర్శి మోహన్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మురళి, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఐఎన్‌టియుసి జిల్లా ఉపాధ్యక్షులు సుందరం పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నుంచి కలెక్టర్‌ను తొలగించాలి
* ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలి
* సిపిఐ, సిపిఎం డిమాండ్
తిరుపతి, మార్చి 2: అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ తన చర్యలతో అపహాస్యం చేస్తున్నారని వెంటనే ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వెంటనే నిజాయితీపరుడు, నిష్పక్షపాతిగా వ్యవహరించే అధికారితో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కార్యాలయం ముందే టిడిపి వారు నామినేషన్ వేయడానికి వచ్చిన మాజీ ఎంపిపి వెంకటరమణను అడుకుని,కొట్టి ఆయన నామినేషన్‌ను చించివేయడం అప్రజాస్వామిక మన్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. జిల్లా కార్యాలయం ముందు జరిగిన అప్రజాస్వామిక, దిగజారుడు విధానాలను పరిశీలించి అవసరమైతే ఈ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు పోలీసుల సమక్షంలో, కలెక్టర్ కార్యాలయం ఎదుటే గూండాగిరి చేస్తున్నా, పోలీసుల జీపులో వచ్చిన అభ్యర్థిపైనే దాడి జరిగడం దారుణమన్నారు. ఈ సంఘటనతోనే అధికారులు అధికారపార్టీకి ఏస్థాయిలో వత్తాసుపలుకుతున్నారో అర్థమవుతుందన్నారు. సి ఎం కు చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్య పద్ధయతిలో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలను సైతం రాజకీయం చేస్తున్న అధికారపార్టీ తీరును వామపక్ష పార్టీలు ఎదుర్కొంటాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాల్సిన అధికారులు అందుకు సహకరించని పరిస్థితుల్లో ఏం జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈవిలేఖరుల సమావేశంలో సిపి ఎం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, సిపి ఐ నగర కార్యదర్శి పెంచలయ్య పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా
ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలి
* అధికారులకు ఎన్నికల పరిశీలకులు
అనంతరాము హెచ్చరిక
తిరుపతి, మార్చి 2: సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టడంతోపాటుగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేంత వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని శాసన మండలి ఎన్నికల పరిశీలకులు జి.అనంతరాము చెప్పారు. స్థానిక పద్మావతి అతిధి గృహంలో ఎమ్మెల్సీ ఎన్నికల మోడల్ ఆఫ్ కాండక్ట్‌పైన, బందోబస్తు ఏర్పాట్లుపైన జిల్లా అధికారులతో గురువారం ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్లక్ష్యంగా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఎన్నికలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 08572 242744 నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతుందని, ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. తిరుపతి డివిజన్ పరిధిలో 39 పట్ట్భద్రుల స్థానాలకు, 18 ఉపాధ్యాయ స్థానాలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్, సంయుక్త కలెక్టర్ గిరిషా, ఎస్పీలు గంటాశ్రీనివాస్, జయలక్ష్మి, మదనపల్లి సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.