చిత్తూరు

జిల్లాలో తాగునీటికి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 12 : జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఇంత దుర్భిక్ష పరిస్థితులు ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఊహించుకుంటేనే ఆందోళనకరంగా ఉంది. ఈ ఏడాది వరుణ దేవుడు కనికరించకపోవడంతో పరిస్థితి దినదినానికి దిగజారుతోంది. గత ఏడాది కొంతవరకు వర్షాలు కురవడంతో భూగర్భజలాలు కొంత పెరిగాయి. అప్పట్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడాయి. అయితే ఈ ఏడాది ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో క్రమేణా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎటుచూసినా చుక్కనీరు లేని చెరువులు, కుంటలే దర్శనమిస్తున్నాయి. అనేక గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సుమారు 270 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో భూగర్భజలాలు వందల అడుగు లోతుకు వెళ్లాయి. దీంతో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర క్షామ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. 2015లో జిల్లాలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. భూగర్భజలాలు వందల అడుగుల లోతుకు వెళ్లిపోవడంతో జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య హడలెత్తించింది. నీళ్ల కోసం ప్రజలు పడిన బాధలు వర్ణనాతీతం. అప్పట్లో 2800 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ ట్యాంకర్ల కోసం జనం గంటల తరబడి అన్ని పనులు మానేసి కాపు కాయాల్సిన దయనీయ పరిస్థితులు. ట్యాంకర్ల ద్వారా అందే నీళ్లు ఎటూ చాలక నానా ఇబ్బందులు పడ్డారు. ఆ ఏడాదిలో కేవలం నీటి సరఫరా కోసం సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు మండలాల్లో కొంతవరకు సమస్య జఠిలం కాకపోయినా పడమర మండలాల్లో తీవ్ర క్షామ పరిస్థితులు నెలకొన్నాయి. తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం, పలమనేరు, నియోజకవర్గాల్లో ఎటుచూసినా చుక్క నీరులేని చెరువులు, కుంటలే దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీటికి కోసం జనం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా నెట్టుకురావాలన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. మరోపక్క మూగజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలోను నీటి ఎద్దడి విలయ తాండవం చేస్తోంది. ఈ నియోజకవర్గంలో పలు గ్రామాల ప్రజలు నీటి కోసం ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 18వేల చేతి పంపులు ఉన్నా అందులో సుమారు రెండువేలకు పైగా మరమ్మతులకు గురయ్యాయి. మరో 2500 బోర్లు వర్షాకాలంలోనే పనిచేస్తాయి. మిగిలిన చేతి పంపుల్లో నీరు అడుగంటిపోతున్నాయి. క్రమేణా వీటిలో కూడా చుక్కనీరు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పడమర మండలాల్లో ప్రస్తుతానికే నీటి ఎద్దడి విలయ తాండవం చేస్తుడంతో ప్రజలతో పాటు పశువులు కూడా నీటికి తహతహలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం ముందస్తు కార్యచరణ ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో తాగునీటి కష్టాలు
* అడుగంటిపోతున్న భూగర్భజలాలు
* ఆందోళనలో ప్రజలు
* కుప్పంలో పరిస్థితి దయనీయం

శిల్పారామంలో ఘనంగా హోలీ సంబరాలు
తిరుపతి, మార్చి 12: హోలీ పర్వదినం సందర్భంగా తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో ఆదివారం సాయంత్రం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తిరుపతికి చెందిన ఫేజ్ 3 ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి నగర వాసుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఇందులో భాగంగా శిల్పారామంలో ప్రత్యేకంగా హోలీ డేజే, రెయిన్ డ్యాన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంబరాలలో ముఖ్య అతిథిగా శ్రీ సాయిసుధా హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ సుధారాణి విచ్చేసి హోలీ సంబరాలను ప్రారంభించారు. ఈసందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డిజె సావేరి వివిధ సినీపాటలతో పాటు హోలీ పాటలను ఆలపించి సందర్శకులను ఉత్తేజపరిచారు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది యువతీ యువకులు సంబరాల్లో పాల్గొని రెయిన్ డ్యాన్స్‌లు చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మా టివి ఫేమ్ షర్మిల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో శిల్పారామం పరిపాలనాధికారి ఖాదర్‌వళ్లి, ఫేజ్ 3 ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీకర్, శిల్పారామం పర్యవేక్షకులు హరికృష్ణ, రాధాకృష్ణలు పాల్గొన్నారు.

మహిళలు విద్యావంతులైతేనే సమాజాభివృద్ధి
* డాక్టర్ కృష్ణప్రశాంతి వెల్లడి

తిరుపతి, మార్చి 12: సమాజంలో సగభాగంగావున్న మహిళలు విద్యావంతులు ఐతేనే సమాజాభివృద్ధి వేగంగా జరుగుతుందని ఏఐఎంఏ నాయకురాలు, ప్రముఖ మధుమేహ వైద్యనిపుణురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి అన్నారు. ఏపి ఎస్సీ వెల్పేర్ అసోసియేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక యూత్ హాస్టల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఆమె మాట్లాడుతూ మహిళలు నిరక్షరాశ్యులన్న పరిస్థితి నుంచి బయటపడాలన్నారు. ప్రతి ఒక్కరు చదువుల్లో రాణించాలని ముఖ్యంగా విద్య, వైద్య రంగాంల్లో ముందడగు వేయాలన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మహిళాపక్షపాతి అన్నారు. ఆయన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు అమలై ఉంటే మహిళలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్ దక్కేదన్నారు. బిల్లు ఆమోదం పొందని కారణంగానే నేడు 33శాతం రిజర్వేషన్ కోసం మహిళలు రోడ్డెక్కాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. నేటి యువతరం జ్యోతిబా పూలే, సావిత్రిబాయ్ పూలేలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వీరి జీవితాల్లో ఎన్ని కష్టాలను అనుభవించినా తాము అనుక్ను లక్ష్యాల సాధనకు ఏనాడు వెనుకడుగు వేయలేదన్నారు. తోటి మహిళల అభివృద్ధికి ఆనాడే కృషి చేసిన వీరు నేటి ఆధునిక మహిళలకు ఆదర్శమూర్తులని కొనియాడారు. ఈసందర్భంగా 2017 నీట్ పరీక్షల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకును సాధించిన డాక్టర్ ప్రతిభను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ఏపి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెంగల్రాయులు, మహిళ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్.్ధనభాగ్యం, నాయకురాలు శోభ, ఎస్వీయూ ప్రొఫెసర్ డాక్టర్ రజని తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి మనోజ్ సిన్హా
తిరుపతి, మార్చి 12: కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి మనోజ్ సిన్హా ఆదివారం విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, జె ఇ ఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. దర్శనానంతరం కేంద్రమంత్రికి రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఇ ఓ డాక్టర్ సాంబశివరావు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మరో 20 ఏళ్లలో శ్రీవారి కైంకర్యాలకు సరిపడా చందనం: ఇ ఓ
* రికార్డు సమయంలో 100 హెక్టార్‌లలో చందనం మొక్కల పెంపకం
* టిటిడి డిఎఫ్‌ఓను అభినందించిన ఇ ఓ

తిరుపతి, మార్చి 12: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దైనందిన కైంకర్యాలకు సరిపడా శ్రీ గంధాన్ని మరో 20 ఏళ్లలో టిటిడి స్వయంగా ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యాన్ని సాధించనుందని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు ఉద్ఘాటించారు. ఆదివారం తిరుమలలోని పార్వేటమండపం సమీపంలో ఉన్న శ్రీ గంధవనాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2013వ సంవత్సరంలో12 హెక్టార్లలో టిటిడి శ్రీ గంధం పెంపకాన్ని ప్రారంభించిందన్నారు. అయితే గత ఏడాది రికార్డు సమయంలో మరో 88 హెక్టార్‌లలో శ్రీ గంధవనాన్ని అభివృద్ధి చేసిందన్నారు. దేశంలోనే 100 హెక్టార్లలో శ్రీగంధవనాన్ని ఏర్పాటుచేసిన ఘనత ఒక్క టిటిడికే దక్కుతుందన్నారు. రానున్న రెండు దశాబ్దాల కాలంలో శ్రీగంథం ఉత్పత్తిలో టిటిడి స్వయం ప్రతిపత్తి సాధిస్తుందన్నారు. శ్రీగంథంతో పాటు ఇక్కడ ఎర్రచందనం, నల్లచేవకొయ్య (రోస్‌వుడ్) చెట్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. వీటికోసం ప్రత్యేకంగా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టిటిడి డి ఎఫ్ ఓ శివరాంప్రసాద్, వారి సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆయన రానున్న వేసవి రద్దీ ఏర్పాట్లపై మీడియాకు వివరించారు. తిరుమలలో మరో 200 రోజులకు సరిపడా నీరు ఉన్న కారణంగా వేసవిలో భక్తులకు ఎటువంటి సమస్య ఉండబోదన్నారు. అదేవిధంగా వేసవితాపం నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందులో భాగంగా చలువపందిళ్లు, తెల్లచలువ సున్నం, నాలుగు మాడ వీధుల్లో స్ప్రింక్లర్ నీరు వంటి ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు.

కేశవరెడ్డి విద్యాసంస్థలపై రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు

* 35కోట్లు వెంటనే చెల్లించాలంటూ విద్యా సంస్థ ఎదుట తల్లితండ్రుల ధర్నా
రేణిగుంట, మార్చి 12: విద్యార్థుల తల్లితండ్రుల నుంచి రూ. 35 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డిపై ఆదివారం రేణిగుంట పోలీస్ స్టేషన్లో విద్యార్థుల తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. రేణిగుంట మండలం, కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవ రెడ్డి స్కూల్ వద్ద దాదాపు 200 మంది విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా చేశారు. కేశవరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో సహనం కోల్పోయిన వారు స్కూల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి స్కూల్ బాధితుల సంఘం అధ్యక్షుడు సుభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి సుప్రజలు మాట్లాడుతూ ఇప్పటికి దాదాపు 1100 మంది విద్యార్థుల నుంచి రూ.35 కోట్లు వసూలు చేశారన్నారు. 2015 నుంచి విద్యార్థుల నుంచి డిపాజిట్లు వసూలు చేశారన్నారు. దానిని తిరిగి చెల్లించాల్సి ఉన్నా కేశవరెడ్డి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేశవరెడ్డికి మద్దతుగా నిలబడి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కేశవరెడ్డి జైల్లో ఉన్నా జల్సాలు అనుభవిస్తున్నారని, వేలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు. సి ఎం చంద్రబాబు నాయుడుకి కేశవరెడ్డి ఒక్కడే ఓట్లు వేయలేదని, తాము కూడా ఓట్లు వేశామన్న విషయం గుర్తుంచకోవాలన్నారు. విద్యార్థుల జీవితాల్లో తాను వెలుగులు నింపుతానంటున్న సి ఎం, తమకు డిపాజిట్లు తిరిగి ఇప్పించకపోతే వారి చదువులు మానుకుని కూలీ పనులకు పంపాల్సి వస్తుందని ఆవేదనతో తెలిపారు. కేశవరెడ్డి మాయ మాటలకు తాము నష్టపోయామని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని అయితే తమకు ఇప్పటి వరకు న్యాయం చేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై దారుణమన్నారు. ఇది సరికాదని, వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఈకార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి చంద్రప్రసాద్, కోశాధికారి జగన్మోహన్ రెడ్డి, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.