చిత్తూరు

ఎట్టకేలకు చిత్తూరు మేయర్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 16: చిత్తూరు మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు డివిజన్లను ఈనెల 20వ తేదిన నోటిఫికేషన్‌ను అధికారులు జారీ చేయనున్నారు. చిత్తూరు మేయర్ ఎన్నిక, ఖాళీగాఉన్న రెండు డివిజన్ల ఉపఎన్నికలపై గత కొద్ది రోజులుగా పలువురు కొర్టును ఆశ్రయించడం, నగరంలో ఈఎన్నికలపై అనేక ఊహాగానాలు నెలకొన్న తరుణంలోఎడాదిన్నర ఉత్కంఠతకు తెరపడినట్లైంది. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 33, 38వ డివిజన్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతర మేయర్ ఎన్నిక జరగనున్నది. చిత్తూరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయిన తరువాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 33వ డివిజన్ నుంచి ఎన్నికైన కఠారి అనురాధ చిత్తూరు మేయర్ అయ్యారు. 2015 నవంబర్ లో ఆమె కార్పొరేషన్ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురియ్యారు. అలాగే 38వ డివిజన్ నుంచి వైకాపా అభ్యర్థిగా గెలుపొందిన పులిచెర్ల శివప్రసాద్‌రెడ్డి 2015 డిసెంబర్ నెలలో ఆత్మహత్యకు పాల్పడంతో ఈ రెండు డివిజన్లకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈనెల 20వ తేదిన ఈ డివిజన్ల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలచేసి, అదేరోజు నుంచి నామిషన్లు స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకు కార్పొరేషన్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈనెల 20 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం మూడు గంటలకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడం జరగుతుంది. పోలింగ్ వచ్చే నెల 9న , ఓట్ల లెక్కింపు 11న నిర్వహించనున్నారు. ఈపక్రియ ముగిసిన తరువాత 15న చిత్తూరు మేయర్ ఎన్నిక జరగనున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తూరు మేయర్ స్థానాన్ని బిసి మహిళకు కేటాయించారు. గతంలో మేయర్‌గా ఉన్న కాఠారి అనురాధ హత్యానంతరం డిప్యూటీ మేయర్ సుబ్రమణ్యం ఇన్‌ఛార్జి మేయర్‌గా కొనసాగతున్నారు. అయితే మేయర్ పదివిని బిసి మహిళకు కేటాయించిన నేపథ్యంలో ఉపఎన్నికల అనంతరం మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు డివిజన్లలో జరగనున్న ఉప ఎన్నికలపై నగరంలో రాజకీయ చర్చలు ఊపందుకొన్నాయి. ఈ డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయా? లేక ఏకగ్రీవం అవుతాయా? అన్నది తేలాల్సి ఉంది.

కళాశాలలోనే ప్రిన్సిపాల్ కాపురం
*విద్యార్థులు ఆగ్రహం

శాంతీపురం, మార్చి 16: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏకంగా కళాశాలలోనే కాపురం పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని మఠం జూనియర్ కాలేజీలో గత రెండేళ్లుగా కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ కుటుంబ సమేతంగా మూడు తరగతి గదులలో మకాం పెట్టాడని కళాశాలకు వెళ్లే విద్యార్థినుల చేత వంటపని, ఇంటిపని చేయించుకుంటున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కుమారుడు మధుసూదన్ విద్యార్థులు, అధ్యాపకులపై అజమాయిషి చెలాయిస్తు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకుంటున్నాడని తెలిపారు. అతని మాట వినకపోతే బూతులు తిడుతాడని, మహిళ అధ్యాపకురాలపై విద్యార్థినుల ఎదుట కించపరచి మాట్లాడుతారని తెలిపారు. కళాశాలలో సెమినార్లు, ఫంక్షన్ల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని, ఈ వ్యవహారంపై నిలదీసిన కొంతమంది అధ్యాపకులను బదిలీ చేయించాడని వాపోయారు. కాలేజీలో జరిగే ఏ విషయమైనా బయటకు చెబితే హాల్‌టికెట్లు, బదిలీ సర్ట్ఫికెట్లు, మార్కులు జాబితాలు ఇవ్వనని భయపెడుతారన్నారు. తనకు ఐదు ఆరు డిగ్రీలు ఉన్నాయని, తనకన్నా పైస్థాయి చదువుకున్న అధికారులు లేరని ఎవరికైనా ఫిర్యాదు చేస్తే మీకే నష్టమని ప్రిన్సిపాల్ అనేవారని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ వ్యవహారంపై విద్యార్థులు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియచేసి ప్రిన్సిపాల్‌ను గురువారం నిలదీశారు. ప్రిన్స్‌పాల్ ఆక్రమించిన తరగతి గదిలోని వస్తువులను బయట పడేసారు. ప్రజాప్రతినిధులు ప్రిన్సిపాల్‌ను వివరణ కోరి ఇకపై కాలేజీ నుంచి మకాం మార్చాలని, విద్యార్థుల పట్ల సఖ్యతగా మెలగాలని హితవుపలికారు. లేని పక్షంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

మరుగుదొడ్లుకు 2.93 కోట్లు కేటాయింపు
* కలెక్టర్ సిద్ధార్థజైన్ వెల్లడి

చిత్తూరు, మార్చి 16: జిల్లాలో స్వచ్చ్భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు 2.93.12లక్షల నిధులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ఈ నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గానికి 25.43లక్షలు, చిత్తూరు 11.31లక్షలు, జి.డి.నెల్లూరు 13.97, కుప్పం 34.44, మదనపల్లె 8.20, నగరి 15.08, పలమనేరు 27.07, పీలేరు 20.75, పుంగనూరు 43.51, పూతలపట్టు 22.06, సత్యవేడు 29.73, శ్రీకాళహస్తి 23.12, తంబళ్లపల్లి 18.45లక్షల రూపాయల చొప్పు నిధులు కేటాయించినట్లు తెలిపారు.