చిత్తూరు

ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 4: ఎస్‌ఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆబ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈనెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న కోదండరామస్వామివారి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉదయం 3గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన జరిగింది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. బుధవారం ధ్వజారోహణంతో ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. అదేరోజు సాయంత్రం 4 గంటలకు పోతన జయంతి, కవి సమ్మేళనం రాత్రి 8 నుంచి 9.30 గంటల మధ్య శేషవాహన సేవ జరుగుతుంది. ప్రతి రోజూ రాత్రి 8 నుంచి 9.30 గంటల మధ్య వివిధ వాహన సేవలు జరుగుతాయి. ఇందులో భాగంగా 5న శ్రీరామనవమి, 6న హంసవాహనం, 7న సింహవాహనం, 8న హనుమంత వాహనం, 9న గరుడ వాహన సేవలు జరుగుతాయి. 10వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య గజవాహనం, 11న రథోత్సవం, 12న అశ్వవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం 11.36 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా 14వ తేదీ సాయంత్రం 5గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీసిటీలో సబ్ పోస్ట్ఫాసు ప్రారంభం
సత్యవేడు, ఏప్రిల్ 4: శ్రీసిటీలో నూతన సబ్ పోస్టాపీసును మంగళవారం ఉదయం కర్నూలు రీజియన్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ వి.సంతానరామం ప్రారంభించారు. ఈకార్యక్రమాన్ని శ్రీసిటి ఎండి రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సబ్‌పోస్ట్ఫాసు ప్రారంభోత్సవం అనంతరం శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో సంతానరామం మాట్లాడుతూ పోస్ట్ఫాసు ద్వారా అందుబాటులో ఉన్న అన్నిరకాల సేవలను నేటి నుంచి శ్రీసిటీలో పొందచ్చని అన్నారు. 160 ఏళ్ళ చరిత్రగలిగిన భారత పోస్టల్ విభాగం ఇప్పటికీ నిత్యనూతనంగా ప్రజలకు విలువైన, నమ్మకమైన సేవలు అందిస్తోందన్నారు. బిజినెస్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, బిజినెస్ ఎక్స్‌ప్రెస్ పార్సల్ సర్వీస్, ఈ పోస్టు, ఈ పేమెంట్, రీటైల్ పోస్టు, మై స్టాంప్ లాజిస్టిక్ సేవలు తాము అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక సేవల్లో భాగంగా సేవింగ్ బ్యాంక్, ఇన్సూరెన్స్, నేషనల్ పెన్షన్ స్కీం, సేవలు అమల్లో ఉన్నాయని అన్నారు. డిమాండ్‌ను అనుసరించి శ్రీసిటీ-నెల్లూరు-తిరుపతి-చెన్నయ్ మార్గంలో ఒక ప్రత్యేక మోటార్ మైల్ సర్వీస్‌ను ప్రారంభిస్తామన్నారు. శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీకి ఇది చాలాప్రత్యేకమైన రోజుగా పేర్కొన్నారు. అధికారికంగా ఒక చిరునామా లభించడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా పరిశ్రమల వారికి పోస్టల్ ఇబ్బందులు తొలగుతాయన్నారు. భవిష్యత్తులో సబ్‌పోస్ట్ఫాసు హెడ్‌పోస్ట్ఫాసుగా ఎదుగుతుందని చెప్పారు. కాగా శ్రీసిటీ సబ్‌పోస్టు పరిధిలోకి సత్యవేడు మండలంలోని ఇరుగుళం,వరదయ్యపాల్యెం మండలంలోని చిలమత్తూరు బ్రాంచ్ పోస్ట్ఫాసులు వస్తాయన్నారు. ఇకపై ఈ సబ్‌పోస్ట్ఫాసు పరిధిలోని గ్రామాలకు 517646 పిన్ నెంబర్ వర్తిస్తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో తిరుపతి పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చంద్రగిరి కోదండరాముని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం
* నేడు ధ్వజారోహణం
చంద్రగిరి, ఏప్రిల్ 4: టిటిడి ఆధ్వర్యంలోని స్థానిక శ్రీ కోదంరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో చలువ పందిళ్లు వేసి, అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. అంకురార్పణం సందర్భంగా మంగళవారం తెల్లవారు జామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం 6 గంటలు సేనాథిపతి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేడు ధ్వజారోహణం
బుధవారం ఉదయం 5గంటల నుంచి 6 గంటల మధ్య స్వామి, అమ్మవార్ల మూలవర్లకు అభిషేకం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల మధ్య ధ్వజారోహణం ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈసందర్భంగా ఆలయంలో 8వతేదీన ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. 10వ తేదీన 5 నుంచి 7గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 8 నుంచి 9గంటల మధ్య స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 11వ తేదీ రాత్రి 7 నుంచి 8గంటల మధ్య శ్రీ కోదండరామ స్వామివారు హనుమంత వాహనంపైన, 13న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, 10.30 నుంచి 11.45 గంటల వరకు ధ్వజావరోహణం జరుగుతుంది. 14వ తేదీన సాయంత్రం 5 నుంచి 7గంటల మధ్య శ్రీ రామ పట్ట్భాషేక మహోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. అలాగే ఈనెల 5 తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్యప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.