చిత్తూరు

బొజ్జలకు బాబు ‘సలహా’ నచ్చిందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 4: సంక్షోభాన్ని అణచివేయడంలో సామ, దాన, బేధ, దండోపాల్ని ఉపయోగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందెవేసిన చెయ్యి అన్నది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణలో స్థానం కోల్పోయి, స్థానం దక్కని తెలుగు తమ్ముళ్ల అసంతృప్తిని, ఆగ్రహాన్ని సంతృప్తిగా మార్చడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. పార్టీకన్నా వ్యక్తులు ముఖ్యంకాదని, తేడావస్తే తన రూటే వేరని ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా హెచ్చరించే చర్యలపై బాబు దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే టెలీకాన్ఫరెన్స్ ద్వారా సామ,దాన, బేధ దండపాయాల్ని ప్రయోగించారు. అయితే టిడిపిలో సీనియర్ నేత శ్రీకాళహస్తి నియోజకవర్గంపై పట్టున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయంలో మాత్రం బాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో బొజ్జలకు క్యాబినెట్ హోదా ఉన్న సలహాదారు పదవిని ఇస్తామని అలాగే ఆయన కుమారుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా పదవిని ఇస్తామని తను నమ్మిన దూతలు ద్వారా బొజ్జలకు సమాచారం అందించారు. దీంతో ఆయన కూడా కొంత చల్లబడినట్లే కనిపిస్తోంది. దీంతో శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని టిడిపిలో విభేదాలు తప్పవనే ప్రచారానికి తెరపడినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం బొజ్జల కుటుంబంలో ప్రశాంత వాతావారణం కనిపిస్తోంది. అయితే ఇది తుఫాను ముందు ప్రశాంత వాతావరణమా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇదిలావుంటే బొజ్జల అసంతృప్తిని అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్, వైకాపాలకు చెందిన నేతలు టిడిపిలో జరుగుతున్న పరిణామాలను అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. బొజ్జల వైకాపా వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం సాగినా మంగళవారం నాటికి మాత్రం ఈ ప్రచారం నిశ్శబ్ద రూపాన్ని దాల్చింది. కాగా ఇక టిడిపి రాష్ట్రంలో ఎలాగూ రెండు సంవత్సరాలు అధికారంలో కొనసాగడం ఖాయం. ఇక అధికారపార్టీతో విభేదాలు పెట్టుకుంటే నియోజకవర్గంలో పనులకు కూడా ఇబ్బందులు తప్పవని, రాజీ ధోరణితో వ్యవహరించడమే మంచిదని బొజ్జల అనుచరుల్లో ఒక వర్గం ముందునుంచే భావిస్తూ వచ్చారు. మరికొంత మంది మాత్రం బాబుతో, అమీతుమీ తేల్చుకుంటే మంచిదని బొజ్జల కుంటుంబానికి సలహా ఇచ్చినవారూ లేకపోలేదు. ఇలాంటి వ్యవహారాలను పసిగట్టగలిగే శక్తిసామర్థ్యాలున్న బాబు తనదైన శైలిలో స్పందించి బొజ్జల సంక్షోభానికి తెరదించారు. ఇదిలాఉండగా పార్టీలో బొజ్జలకున్న పట్టును తగ్గించడానికి ఆపార్టీలోని ఒక వర్గం చాపకింద నీరులా ఆయనకు, ఆయన కుటుంబానికి వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా సాగించింది. ముఖ్యంగా మంత్రి తనయుడు, కుటుంబసభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, భూకబ్జాలకు పాల్పడ్డారని, ఇసుక మాఫియాను పెంచి పోషించారని విష ప్రచార చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బొజ్జలను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో తమకు సానుకూల వాతావరణం ఏర్పడిందని భావించారు. అయితే బాబు బుజ్జగింపు, తాయిళాలతో బొజ్జల మెత్తబడ్డాడు. ఇది ప్రత్యర్థి వర్గానికి మింగుడుపడటంలేదు. బొజ్జలకు సలహాదారు పదవి ఇచ్చినా ఆయనకు మంత్రి స్థాయిలో విశేషాధికారాలు ఏవీ ఉండే అవకాశం లేకపోవడం ప్రత్యర్థి వర్గానికి కొంత ఊరట కల్పించే అవకాశమనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో బొజ్జల తనయుడు సుధీర్‌రెడ్డి పార్టీ ఇన్‌చార్జ్‌గా ఏమేరకు నాయకులను, కార్యకర్తలను ఒక తాటిపైకి నడిపించడంలో అనుసరించే ఎత్తుగడలపైనే బొజ్జల కుటుంబం రాజకీయ భవిష్యత్తును తేల్చనుంది.

జోరుగా మున్సిపల్ ఉప ఎన్నికల ప్రచారం
* టిడిపి, వైకాపా నాయకుల పోటాపోటీ ప్రచారం
చిత్తూరు, ఏఫ్రిల్ 4 : చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్‌కు జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు అధికార ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, వైకాపా అభ్యర్థులు మంగళవారం డివిజన్ పరిధిలో పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలో టిడిపి అభ్యర్థి చెరుకూరి వసంత్‌కుమార్ పార్టీ రాష్ట్ర నాయకులు డికె బద్రినారాయణ, ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లకు తమ పార్టీ అభ్యర్థి గెలుపొందితే డివిజన్‌లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అదే విధంగా వైకాపా అభ్యర్థి పులిచెర్ల జ్యోతి వైకాపా చిత్తూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ జిల్లా కార్యదర్శి, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు సయ్యద్ సర్దార్, మైనారిటీ నేతలు గులాబ్, దస్తగిరి సహకారంతో డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అధికారంలోకి వచ్చాక గత మూడేళ్ల కాలంలో టిడిపి వైఫల్యాలు, తాము గెలిస్తే డివిజన్‌లోని సమస్యల పరిష్కారానికి తీసుకోనున్న చర్యలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఇరుపార్టీల అభ్యర్థులు ప్రత్యేక ప్రచార రథాలను వినియోగించి ప్రచారం నిర్వహించారు. ప్రచార వాహనాల్లో ఆయా పార్టీలు చేస్తున్న, చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు రికార్డుల ద్వారా వినిపించారు. దీంతో 38 వ డివిజన్‌లో ప్రచార రథాల హోరెత్తుతోంది. ఏది ఏమైనప్పటికి ఈ నెల 9న జరిగే ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇరు పార్టీల అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నట్లు తమ ప్రచారశైలిని బట్టి తెలుసుకోవచ్చు.