చిత్తూరు

కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన వేదనారాయణ స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, ఏప్రిల్ 15: నాగలాపురం మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు శనివారం కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవలో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపి స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేక అలంకరణల అనంతరం తోమాల సేవ నిర్వహించి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వార్లను ప్రత్యేక అలంకరణ చేసి కల్పవృక్ష వాహనంపై వేంచేపుచేసి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపుముందు మంగళవాయిద్యాలు, కోలాటాలు, భజనలు భక్తులను ఆకట్టుకుంది. అనంతరం మాడ వీధుల్లోని భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర హారతులిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారికి సంప్రదాయ ప్రకారంగా వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ చేసి అత్యంత వైభవంగా 6 నుంచి 6.45 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనంపై వేంచేపుచేసి రాత్రి 9.30 గంటల వరకు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కరిసింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనప్రసాదం అందేలా టిటిడి అధికారులు తగు ఏర్పాట్లుచేసి పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నాగరాజ భట్టాచార్య, ఆలయ ఇన్స్‌పెక్టర్ నందకుమార్, షరాబు ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో స్వల్ప ప్రమాదం
పిట్టగోడను ఢీకొన్న కారు
తిరుపతి, ఏప్రిల్ 15: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ టవర్ వద్ద శనివారం ఓకారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. తిరుమల నుంచి తిరుపతి వస్తున్న కారును డ్రైవర్ వేగ నియంత్రణ చేయలేక పోవడంతో రోడ్డుపక్కన సిమెంట్ గోడను ఢీకొంది. అయితే ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారెవరికీ గాయాలు కాలేదు. కాగా ప్రమాదానికి గురైన కారును టిటిడి డి ఐ భాస్కర్‌నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ నుంచి తొలగించారు.

అమ్మవారి సేవలో
మాజీ క్రికెటర్
కృష్ణమాచారి శ్రీకాంత్
తిరుపతి, ఏప్రిల్ 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శనివారం మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి సూపరింటెండెంట్ రవి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.