చిత్తూరు

కడ వరకు టిడిపిలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 15: బొందిలో ప్రాణం ఉన్నంత వరకు టిడిపికి వీడే ప్రసక్తేలేదని మరో పార్టీలోకి వెళ్లేది లేదని మాజీ మంత్రి, శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శనివారం స్పష్టం చేశారు. 69వ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ కాళహస్తిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అనారోగ్యం కారణంతో మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి తొలగించారని, ఆ బాధతో, ఆవేశంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారని చెప్పారు. అయితే ప్రజలు, కార్యకర్తలతో చర్చించిన తరువాత రాజీనామాను ఉపసంహరించుకోవడానికి నిర్ణయించుకున్నానన్నారు. ప్రాణం ఉన్నంత వరకు టిడిపిలోనే కొనసాగుతానని, మరోపార్టీలోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారికి తన నిర్ణయం బాధగా ఉంటుందని తెలిపారు. ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రైన గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేశారని, అదేవిధంగా తానుకూడా లోకేష్‌కు అండగా ఉండి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. తమ కుటుంబం పార్టీలు మార్చే కుటుంబం కాదని, టిడిపిలోనే కొనసాగుతామని చెప్పారు. దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకొని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం చేశారు. కౌన్సిలర్ సుప్రజ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు వద్ద అన్నదానం జరిగింది. ప్రభుత్వాసుపత్రి రోగులకు కూడా కంటి అద్దాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీరామమూర్తి, మునిరాజానాయుడు, చెంచయ్యనాయుడు, రామాంజులునాయుడు, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామమైన శ్రీ కాళహస్తి మండలం ఊరందూరులో కూడా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
పేదల సంక్షేమానికి నిరంతరం కృషి
ఏర్పేడు: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తుందని మాజీ అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 69వ పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రం ఏర్పేడు పంచాయతీ కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ ధనంజయులు నాయుడు, టిడిపి తెలుగు యువత అధ్యక్షులు నాగరాజులు నాయుడు ఆధ్వర్యంలో మంత్రి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏర్పేడులో మంత్రి చేతుల మీదుగా 60 కేజీల బర్తడే కేక్ కట్‌చేసి పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మంత్రిని ఘనంగా శాలువతతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులతో అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని తెలిపారు. ఐదుసార్లు తమకు విజయాన్ని చేకూర్చిన మండల నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అందిరిలా పార్టీలు మార్చే తత్వంకాదని, పార్టీకోసం అహర్నిశలూ శ్రమించే తత్వం అన్నారు. అభిమానుల ఆదరణ మరువలేనన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానుకానీ పార్టీకి చేయలేదని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. పాత వీరాపురం సర్పంచ్ ధనలక్ష్మి, బిజెపి పార్టీలో నుంచి మండల టిడిపి కన్వీనర్ ధనంజయనాయుడు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నాగరాణి, వైస్ ఎంపిపి మురుగన్, తెలుగు యువత అధ్యక్షుడు నాగరాజునాయుడు, నిరంజన్, బాబునాయుడు, సర్పంచ్ సురేఖ, భారతి, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు మల్లికార్జుననాయుడు, సుధాకర్‌నాయుడు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.