చిత్తూరు

చిత్తూరును పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 15: జిల్లా అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి ఎన్. అమరనాధ్‌రెడ్డి స్పష్టం చేసారు. శనివారం చిత్తూరులో నూతన మేయర్‌గా ఎన్నికైన హేమలత అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాకేంద్రమైన చిత్తూరు అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందన్నారు. చిత్తూరు నగరాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడానికి చొరవ తీసుకున్నట్లు తెలిపారు. నగరం ఇటు తమిళనాడు, అటు కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం సుమారు 800కోట్ల రూపాయలు ప్రోత్సాహాలను ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే చిత్తూరు నగరానికి తాగునీటితో పాటు పలు కనీస సౌకర్యాల కల్పన కల్పించడం జరిగిందన్నారు. త్వరలోనే నగరం నడిబొడ్డున 25కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రాన్ని దీటుగా అభివృద్ధి చేయాలన్న దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణం జోరుగా కొనసాగుతుందని తెలిపారు. కార్పొరేషన్ పాలక వర్గానికి తన సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నగర అభివృద్ధికి నూతన పాలక వర్గం కూడా అందరితో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈకార్యక్రమంలో జడ్పి చైర్‌పర్శన్ గీర్వాణి, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ హేమలత, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు లలితకుమారి, ఎ ఎస్ మనోహర్, దేశం నేతలు నాని, బద్రినారాయణ, ప్రవీణ్, షణ్ముగం, మాపాక్షి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అభినందనల వెల్లువ:-
చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా ఎన్నికైన హేమలతను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అమరనాధ్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర దేశం నేతలు, పలువురు ప్రముఖులు కార్పొరేషన్ కార్యాలయానికి భారీగా తరలి వచ్చి అభినందనలతో ముంచెత్తారు. అలాగే కఠారి అభిమానులతో పాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. దీనితో కార్పొరేషన్ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.