చిత్తూరు

సాఫీగా సాగిన మేయర్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 15: చిత్తూరు మేయర్ ఎన్నికలు ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సాఫీగా కొనసాగింది. ముందుగా కార్పొరేషన్ పరిధిలోని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు అందరూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశమైయ్యారు. అక్కడ మంత్రి అమరనాధ్‌రెడ్డితోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ దొరబాబు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసారు. పార్టీ పరంగా విప్ జారీ చేసారు. అనంతరం ప్రదర్శనగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. తదుపరి కార్పొరేషన్ సమావేశ మందిరంలో 33వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన కఠారి హేమలత చేత కార్పొరేషన్ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ సమావేశంలో కోరం విషయాన్ని పరిశీలించారు. కోరం ఉండడంతో మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించారు. దీనితో కఠారి హేమలత మేయర్ అభ్యర్థిగా పార్టీపరంగా బిఫాం అందచేసారు. ఈమెను డిప్యూటి మేయర్ సుబ్రహ్మణ్యం ప్రతిపాదించగా మరో కార్పొరేటర్ కిరణ్‌కుమార్ బలపరచారు. తదుపరి మిగతా కార్పొరేటర్లు అందరూ ఆమె ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. దీనితో కలెక్టర్ హేమలతను చిత్తూరు మేయర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించి తదుపరి ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
నగ రాభివృద్ధికి కృషి

చిత్తూరు, ఏప్రిల్ 15: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతనంగా మేయర్‌గా ఎన్నికైన కఠారి హేమలత తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో ముందుగా కార్పొరేటర్‌గా ప్రమాణం చేసిన అనంతరం ఆమెను కార్పొరేటర్లు చిత్తూరు మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ఈ పదవి తనకు మరింత బాధ్యత పెంచిందని పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తోడ్పాటును అందిస్తామన్నారు. తన అత్త, మామలు మరణానంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమపై నమ్మకంతో అ పదవిని అప్పగించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించే విధంగా కార్యచరణ ప్రణాళికలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో నగరంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని డివిజన్లలో ఉన్న సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతామని అన్నారు. నగర వాసులకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.