చిత్తూరు

రేణిగుంట బజారువీధిలో తెలుగుతమ్ముళ్ల వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 14: స్థానిక బజారు వీధిలో తెలుగు తమ్ముళ్ళు రణరంగం సృష్టించారు. అదుపుచేసేందుకు వెళ్ళిన పోలీసులపై తిరగబడిన సంఘటన గురువారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెడితే బుధవారం రాత్రి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలో పంచాయతీ కాంట్రాక్ట్ వర్క్స్ గురించి బాహాబాహికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం రాత్రి బజారు వీధిలో టిడిపి పట్టణాధ్యక్షుడు వెంకటేష్ చౌదరి, సీనియర్ నాయకుడు పుష్పనాథన్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో పక్కనే వీరి అనుచరులు గొడవను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇరువర్గాల వారి సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. ఏ క్షణాన ఏమవుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులను సైతం వారు లెక్కచేయలేదు. దీంతో ఓ వర్గం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు వెంకటేష్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్‌ను తరలించేందుకు సిద్ధపడటంతో అతని అనుచరులు పోలీసులపై తిరగబడ్డారు. కాగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే పార్టీ సీనియర్ నాయకులు అక్కడకు చేరుకుని రాజీ ప్రయత్నాలు చేపట్టారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే తెలుగు తమ్ముళ్ళు రోడ్డుపై రణరంగం సృష్టించడం, పోలీసులను సైతం పక్కకు నెట్టేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై పార్టీ జిల్లా నాయకులు, మంత్రి చొరవ తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.