చిత్తూరు

ఇసుక మాఫియాపై తుదిశ్వాస వరకు పోరాడిన మునగలపాల్యెం రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: తమ ప్రాంతంలోని ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదించుకుంటున్న ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం వారి తుదిశ్వాస వరకు సాగింది. అయినా వారి డిమాండ్ మాత్రం తీరలేదు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలోని పాపానాయుడు పేట, మునగల పాల్యెం, చెల్లూరు, గోవిందవరం, మోదుగుల పాల్యెం,కోబాక గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని తమ పొలాల్లోని ఇసుకను సైతం ఇసుక మాఫియా వదలకుండా తరలిస్తున్న తీరుపై వారు అనేక పర్యాయాలు రెవిన్యూ అధికారులకు, స్థానిక పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. అయినా వారి గోడు విన్నవారే తప్ప ఆ సమస్యలను పరిష్కరించేవారు కనిపించలేదు. అదే సమయంలో దాదాపు 50 మంది మునగలపాల్యెం వాసులు శుక్రవారం ఇదే విషయమై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే ఇది రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తుందని, తాము దీనిపై కేసులు నమోదు చేయలేని ఎస్పీ చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. అయితే ఊహించని విధంగా వారిపైకి దూసుకువచ్చిన లారీ వారి ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ పరిస్థితిలో ఈ ప్రమాదానికి కారణం ఇసుక మాఫియానే అనే అనుమానాలు వ్యక్తం అయినా అది నిజం కాదని లారీ డ్రైవర్ మద్యం సేవించడం, మలుపు వద్ద సున్నపు రాయి ఉన్న భారీ లారీ వేగాన్ని డ్రైవర్ నియంత్రించక పోవడం కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇసుక మాఫియాపై వారు చేసిన పోరాటం మాత్రం ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ఒకే గ్రామానికి చెందిన 15 మంది మృత్యువాత పడటం జిల్లా వాసులను కలచివేసింది. చివరికి ఎస్పీ జయలక్ష్మి సైతం తీరని ఆవేదనకు గురయ్యారు. మునగలపాల్యెం మొత్తం విషాద ఛాయల్లోకి వెళ్లిపోయింది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యత స్వీకరించిన ప్రద్యుమ్న సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించారు. ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీ వద్దకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అయితే మృతుల ఆత్మకు నిజమైన శాంతి కలగాలంటే వారు చేసిన ఆందోళనను అర్థం చేసుకుని ఈప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యతను ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు చిత్తశుద్ధితో నియంత్రించాల్సిన అవసరం ఎంతైనావుందని ప్రజలు భావిస్తున్నారు.
రైతుల గోడు వినుంటే
ఈ ఘోరం జరిగేది కాదు
* సిపిఎం విమర్శ
అధికారపార్టీకి చెందిన నాయకుల ఇసుక మాఫియాపై రైతులు ఫిర్యాదులు చేస్తున్నా, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం వల్లే నేడు నడిరోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతులు అన్యాయంగా మృత్యువాత పడ్డారని అన్నారు. మృతి చెందిన రైతులకు ఒక్కోక్కరికి రూ. 25లక్షలు, గాయపడ్డ వారికి రూ.10లక్షలు, ఉచిత వైద్యం అందించడంతోపాటుగా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతులతో ఎస్పీ, సి ఐ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమన్నారు.
గాయపడ్డవారికి నాణ్యమైన వైద్యం అందించాలి - ఎన్‌ఎస్‌ఎఫ్
ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారికి సరైన వైద్యం అందించాలని ఎన్ ఎస్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ విజయభాస్కర్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.