చిత్తూరు

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమల, ఏప్రిల్ 21: సోమల మండలంలో శుక్రవారం మధ్యాహ్నం వడగండ్ల వాన, గాలి అధికంగా రావడంతో భారీస్థాయిలో పంటనష్టం సంభవించింది. గాలి అధికంగా వీయడంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలపాలయ్యాయి. పలుచోట్ల వరి, మొక్కజొన్న, మామిడి కాయలు అధికంగా గాలికి పూర్తిగా నేలపాలయ్యాయి. పూర్తిగా టమోటా పంట పూర్తిగా నేలమట్టమైంది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పూర్తిగా విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంది. పెద్ద ఉప్పరపల్లెలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు దగ్ధమైంది. రోడ్డు వైపు ఉన్న చెట్లు రోడ్డుపై అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. స్థానికులు చెట్లను తొలగించారు.
కూలిన చెట్లు
కుప్పం: కుప్పం పట్టణంలో శుక్రవారం సాయంత్రం సుమారు గంట పాటు గాలి వాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ప్యాలెస్ రోడ్డులో పలు చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోయాయి. దీనితో సుమారు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పంచాయతీ అధికారులతో పాటు సిఐ రాజశేఖర్, ఎస్సై రామస్వామి పోలీస్ సిబ్బంది తదితరులు ప్రదేశానికి చేరుకొని జెసిబి యంత్రంతో పనులు చేపట్టారు. సుమారు గంట సమయం అనంతరం రోడ్డుపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అయితే సాయంత్రం వేళ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడటంతో పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రజలకు మంచి సేవలు చేయాలన్నదే తపన
* జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రద్యుమ్న

చిత్తూరు, ఏప్రిల్ 21 : జిల్లా ప్రజలకు మంచిసేవలు చేయాలన్నదే తన ఆకాంక్ష అని జిల్లా నూతన కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ దేశంలోనే కీలకమైనది ఈ జిల్లా అని, ఈ జిల్లాను అన్ని రంగాల్లో వృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు, గతంలో ఇక్కడే జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించడంతో జిల్లాపై కొంత అవగాహన ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమల్లో పాలుపంచుకోవాలని తెలిపారు. అంతకుముందు జెసి గిరిషా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కొత్త కలెక్టర్‌కు స్వాగతం పలికారు. తదుపరి జిల్లా వ్యాప్తంగా పలువురు అధికారులు కలెక్టర్‌ను సాంప్రదాయబద్ధంగా కలిసి పరిచయం చేసుకున్నారు.

ఈప్రమాదం దురదృష్టకరం
* మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి

తిరుపతి, ఏప్రిల్ 21: ఏర్పేడులో జరిగిన ప్రమాదం దురదృష్టకరం బాధాకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో గాయపడి రుయా, సిమ్స్‌లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడానికి మంత్రి తిరుపతికి వచ్చారు. ఈసందర్భంగా ఆయన క్షతగాత్రుల వద్దకు వెళ్లివారికి అందుతున్న వైద్యసేవలను గమనించారు. అనంతరం డాక్టర్లతోను, అధికారులతోను చర్చించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఏర్పేడులో జరిగిన ప్రమాదం పట్ల సిఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతే కాకుండా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదులక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించారని అన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించడానికి వారికి అయ్యే ఖర్చులన్నిటిని కూడా ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు మరింత సహాయం అందించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన అన్నారు.