చిత్తూరు

2025 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 27: ప్రస్తుతం రాష్ట్ర అటవీశాఖ వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వల్లో 2025 మెట్రిక్ టన్నుల విక్రయానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడానికి కృషిచేస్తున్నామని, 15 రోజుల్లో అనుమతి రావచ్చని రాష్ట్ర అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి సిద్దా రాఘవరావు అన్నారు. గురువారం టాస్క్ఫోర్స్ ఐజి కాంతారావు, ఇతర అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన భాకరాపేట, రేణిగుంట, తిమ్మినాయుడుపాళ్యం, కపిలతీర్థంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్‌లను పరిశీలించారు. అలాగే తిమ్మినాయుడుపాళ్యంలో 25 ఎకరాల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.22 కోట్లతో నిర్మించిన ఎర్రచందనం గిడ్డంగుల సముదాయాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ పోలీసులు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులను, ఇతర మారణాయుధాలను ఆయన పరిశీలించారు. అనంతరం అటవీశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్రాలను తిలకించారు. అలాగే బయోమెట్రిక్ పరిశోధనా కార్యాలయం నందు అత్యాధునిక టిష్యూ కల్చర్ ద్వారా ఏర్పాటుచేసిన టేకు, ఎర్రచందనం, వేప మొక్కలను పరిశీలించారు. అనంతరం కపిలతీర్థం రోడ్డులోని టాస్క్ఫోర్స్ కార్యాలయం వద్ద ఉన్నతాధికారులతో ఎర్రచందనం స్మగ్లింగ్ నివారించడానికి చేపట్టాల్సిన వ్యూహాలను అధికారులతో సమీక్షించారు. అలాగే ఆయన ఎర్రచందనం చెట్లను నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి ఎర్రసంపద కాపాడటం జరిగిందన్నారు. కూంబింగ్ దాడుల మూలంగా కోట్లాది రూపాయల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 3615 మెట్రిక్ టన్నుల ఎర్రచందనంను తొలిసారి వేలంలోవిక్రయించడం ద్వారా 991 కోట్ల రూపాయలు సొంత ఖజానాకు ఆదాయం కలిగిందన్నారు. ప్రస్తుతం తిరుపతి-రేణిగుంట ఎర్రచందనం గోడౌన్‌లో 8650 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలు నిల్వ ఉన్నాయన్నారు. వీటిలో 2025 మెట్రిక్ టన్నులను త్వరలోవిక్రయించనున్నామన్నారు. డిజి ఎఫ్ టి, సి ఐటి ఇ ఎస్ అనుమతులు పొందిన వెంటనే ఈ ఎర్రచందనం దంగలను విక్రయిస్తామన్నారు. తక్కిన ఎర్రచందనం దుంగల నిల్వలను కూడా దశలవారీగా విక్రయించేందుకు కేంద్రంనుంచి అనుమతులు పొందుతామన్నారు. 2013-14 సంవత్సరంలో 2576 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించామన్నారు. 2015-16 సంవత్సరంలో 2046 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించామన్నారు. 2016-17లో 843 మెట్రిక్ టన్నులు ఎర్రచందనం విక్రయించామన్నారు. గత 3 సంవత్సరాల్లో 4260 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించామన్నారు. అటవీసంపదను కాపాడటం మనందరి ధర్మం అన్నారు. తాము అక్రమ రవాణాదారులకు చెప్పేదొకటేనని, అటవీ సంపదనుదోచేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, గత 2 రోజులక్రితమే తానీ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, పోలీస్‌శాఖ సమన్వయంతో పనిచేస్తూ చిత్తూరు, కడప జిల్లాలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను చాలా వరకు నియంత్రించగలిగామన్నారు. అయినప్పటికీ అక్కడక్కడా అక్రమాలు జరుగుతున్నాయనీ, వాటిని నిలువరించేందుకు కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. టాస్క్ఫోర్స్ విభాగం ఎంతో చక్కగా పనిచేస్తూందని ఆయన అభినందించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారని, 50 శాతం అటవీప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టుబడ్డ స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి కారణమేంటని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. తానిప్పుడే అటవీశాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, వాటిపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, అటవీశాఖ ఉన్నతాధికారులు ఎస్ కె కౌశిక్, వికె సింఘ్, సారంగి, అధికారులు ఉన్నారు.

‘డివిజన్ బాట’లో సమస్యలను పరిష్కరిస్తాం
* చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ
చిత్తూరు, ఏప్రిల్ 27 : మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివిజన్ బాటలో నమోదయ్యే సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో డివిజన్ బాట కార్యక్రమాన్ని 1, 2వ డివిజన్లలో ప్రారంభమైయ్యింది. తొలుత 1వ డివిజన్‌లోని పూనేపల్లికాలని, పెద్దకొత్తూరు గ్రామాల్లో గ్రామ పంచాయ తీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూనేపల్లి కాలనీవాసులు తమకు బస్సు సౌకర్యం కావాలని, తాగునీటి సమస్యతో పాటు, ఎళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సిసిరోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం పెద్ద కొత్తూరు గ్రామంలోని శ్రీరాములగుడిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, మేయర్ కఠారి హేమలతలు అనంతరం గ్రామస్థులతో కాసేపు సమావేశమై సమస్యలపై చర్చించారు. తమ గ్రామానికి దారి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వెంటనే స్పందించి రోడ్డును నిర్మించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సత్యప్రభ స్పందిస్తూ రైల్వే గేటు సమస్య, స్థల సమస్యల కారణంగా దారి నిర్మాణం చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. రైల్వే అధికారులతో చర్చించి రానున్న జన్మభూమి కార్యక్రమంలోగా రోడ్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అదే డివిజన్‌లోని అగ్రహారం వద్ద నాలుగు ఎకరాల భూమిలో రు1.04 లక్షల నిధులతో మంజూరైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం 2వ డివిజన్ పరిధిలో జరిగిన డివిజన్ బాటలో ప్రజలు ఇచ్చిన సమస్యలను నమోదు చేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, టిడిపి రాష్టన్రేతలు బద్రినారాయణ, వైవీ రాజేశ్వరి, కఠారి ప్రవీణ్, పార్టీ నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్, కార్పొరేటర్లు శ్రీకాంత్, నవీన్, సహదేవ, కంద, మున్సిపల్ డిఇ విజయ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ సర్వేయర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

రాయలసీమలో ఇసుక అక్రమ రవాణాపై నిషేధం విధించాలి
* క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి
* మునగళపాళ్యెంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎ పి సిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
* మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లించాలని డిమాండ్
తిరుపతి, ఏప్రిల్ 27: ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 21న ఇసుక మాఫియాను అరికట్టాలని ఆందోళన చేస్తున్న గ్రామస్థులపై లారీ దూసుకెళ్లిన సంఘటనలో మృతిచెందిన 15 కుటుంబాలను ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గురువారం మునగళపాళ్యెంకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది ప్రమాదం కాదని, ఒక పథకం ప్రకారం జరిపిన హత్య అని గ్రామస్థులు అంటున్నారన్నారు. దీనిపై సి బి ఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ దుర్ఘటనలో గాయపడిన వారు కూడా వారి జీవనాన్ని సాగించడం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని క్షతగాత్రులకు రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాల్లో అర్హులైన వారికి ఒక్కో ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు ఉంటే వారికి ఉచితంగా విద్యను అందించాలని కోరారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాపై నిషేధం విధించాలన్నారు. హైవేలపై మద్యం దుకాణాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బెల్టు షాపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏర్పేడులో సంఘటన జరిగిన రోజే విశాఖ మణ్యం ప్రాంతంలో ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని, వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్లుతెరచి ఇసుక మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈసమావేశంలో డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకాళహస్తి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బత్తెయ్యనాయుడు, తిరుపతి నగరాధ్యక్షులు పొలికల మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో ఘనంగా భాష్యకార్ల ‘వేళ్లై సాత్తుపడి ఉత్సవం’
తిరుపతి, ఏప్రిల్ 27: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకార్ల ఉత్సవంలో భాగంగా గురువారం వేళ్లై సాత్తుపడి ( దవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈనెల 22వ తేదీ నుంచి భాష్యకార్ల ఉత్సవం ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఇందులో 6వరోజైన చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీ రామానుజుల వారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని చివరిరోజు మే 1న భాష్యకార్ల సాత్‌మోరా నిర్వహిస్తారు. గురువారం ఉదయం భగవద్ రామానుజచార్యుల వారిని తెల్లని వస్త్రాలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. జియ్యర్ స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్య ప్రబంధ గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జియ్యర్ స్వామి, చిన్నజియ్యర్ స్వామి, అలయ అధికారులు పాల్గొన్నారు. సాధారణంగా భాష్యకార్ల సన్నిధిలో భగవద్ రామానుజాచార్యుల వారికి కాషాయ వస్త్రాన్ని అలంకరిస్తారు. అయితే గురువారం తెల్లని వస్త్రాన్ని అలంకరించారు. ఇందుకు కారణం శ్రీ వైష్ణవాచార్యులైన రామానుజాచార్యుల వారు ఈరోజున శ్రీ రంగం నుంచి తెల్లని వస్త్రాలు ధరించి కర్ణాటక లోని మేల్కోటికి వెళ్లారని, ఇందుకు రామానుజాచార్యుల అనుయాయులైన కురత్తాళ్వార్ సహకారం అందించారని, ఆ తరువాత 14 సంవత్సరాలు రామానుజులు మేల్కోటిలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారని చరిత్ర తెలియజేస్తుంది. ఈ ఘట్టానికి గుర్తుగా భాష్యకార్ల ఉత్సవంలో 6వ రోజు రామానుజాచార్యుల వారికి తెల్లని వస్త్రాన్ని ధరింపచేసి ఊరేగింపు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అన్ని వైష్ణవ ఆలయాల్లో రామానుజుల వారికి ఈ భాష్యకార్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
అర్బన్ ఎస్పీ కార్యాలయం క్లర్క్ అరెస్ట్
తిరుపతి, ఏప్రిల్ 27: ఆదాయాన్ని మించి ఆస్తులు సంపాదించాడని ఆరోపణలతో బుధవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌కు చెందిన రామానుజసర్కిల్‌లోని ఉపాధ్యాయ నగర్‌లో ఉన్న ఇంటిపై ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో, కడప డిఎస్పీ, 5 గురు సిఐల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు వెంకటేష్ ఇంటిపైనే కాకుండా ఆయన కుమారుడు,కుటుంబ సభ్యులకు సంబంధించి 4 చోట్ల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వెంకటేష్ ఉంటున్న ఇల్లు ప్రభుత్వ అంచనా ప్రకారం రూ.3కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వెంటకేష్‌కు 3 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విలువైన 50 సెంట్ల భూములు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులుగా గుర్తించిన అధికారులు వెంకటేష్‌ను గురువారం అరెస్ట్‌చేసి నెల్లూరులోని ఎసిబి కోర్టుకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలకు సర్వం సిద ధం
* జిల్లా కో- ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం
తిరుపతి, ఏప్రిల్ 27: పాలిటెక్నిక్ పరీక్షలకు సంబంధించి హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేయడం జరిగిందని జిల్లా కో-ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం గురువారం తనను కలిసిన విలేకరులకు తెలిపారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 9092వేల మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. మొత్తం 4 సెంటర్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, కుప్పంలలో సెంటర్లను ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 18 పరీక్షా కేంద్రాలుంటాయన్నారు. తిరుపతిలో 7, కుప్పంలో 2, మదనపల్లిలో 7, కలికిరిలో 2 పరీక్షాకేంద్రాలుంటాయన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల లోపు విద్యార్థులు ఆయా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. విద్యార్థులు నిబంధనలు పాటించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలన్నారు.

బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి
రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, ఏప్రిల్ 27: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చినగర వాసి కృష్ణ భవన్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అధినేత ఆర్.రాధేష్ స్విమ్స్‌లో నిర్వహిస్తున్న శ్రీబాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి గురువారం రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డివిడిని స్విమ్స్ డైరెక్టర్ చాంబర్‌లో డాక్టర్ టి ఎస్ రవికుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రాధేష్ తన ప్రతినిధి ద్వారా ఈ మొత్తాన్ని అందించారని తెలిపారు.

ఏర్పేడు దుర్ఘటనలో గాయపడ్డ జర్నలిస్టు బాలమురళి మృతి
* 16కు చేరిన మృతుల సంఖ్య
తిరుపతి, ఏప్రిల్ 27: ఏర్పేడు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చెన్నైలో చికిత్స పొందుతున్న విలేకరి బాలమురళి కృష్ణ గురువారం మృతిచెందారు. ఈనెల 21న ఏర్పేడులో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాచేస్తున్న మునగలపాళ్యెం గ్రామస్థులపైకి లారీ దూసుకెళ్లిన సంఘటనలో విధి నిర్వహణ నిమిత్తం వెళ్లిన జర్నలిస్టు బాలమురళి తీవ్రంగా గాయపడి చెన్నైలోని విజయా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం పాఠకులకు విదితమే. వాస్తవానికి బాలమురళి గాయపడ్డ రెండు రోజుల్లోనే మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయన శ్వాస పీల్చుకోవడంతో తిరిగి ఆయనకు విజయా హాస్పిటల్ వైద్యసిబ్బంది చికిత్స అందించారు. 7 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలమురళి చివరకు అసువులు బాసారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అన్ని జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు కోరుతున్నారు.
తిరుపతిలో ఆటో బీభత్సం
* డ్రైవర్‌కు తీవ్రగాయాలు
తిరుపతి, ఏప్రిల్ 27: తిరుపతి తుడా రోడ్డు మార్గంలో ఓ ఆటోడ్రైవర్ పట్టపగలు మద్యం సేవించి ఆటోను జనాలపైకి నడిపిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో భీతాహులైన ప్రజలు పరుగులు తీశారు. దీంతో డ్రైవర్ ఆటోను విక్టరీవైన్స్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటో నడుపుతున్న డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్‌ను 108లో రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏర్పేడు దుర్ఘటనలో మద్యం సేవించి లారీ నడిపి 15 మంది మృతికి, 25 మంది గాయపడటానికి కారణమైన డ్రైవర్ ఉదాంతం మరువక ముందే తిరుపతిలో ఓ ఆటోడ్రైవర్ పట్టపగలు మద్యం సేవించి జనంపైకి ఆటో నడపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదన్న నిబంధనలు మరోమారు గాలిలోకలిసిపోయాయి. మద్యం సేవించి ఆటో నడిపిన డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

జిల్లాను కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
* రైతుల జీవన ప్రమాణాలు పెంచాలి
* కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశం

చిత్తూరు, ఏప్రిల్ 27: జిల్లాను కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దటంతో పాటు, రైతలు జీవన ప్రమాణాలు పెంచే విధంగా సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన శాఖల అధికారుల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట వేసిన తరువాత పంట చేతికి వచ్చే వరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మమేకం అయ్యి రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్గించాలన్నారు. అధునాతన పద్దతుల పట్ల రైతులు మక్కువ చూపే విధంగా వారిలో చైతన్యం తీసుకు రావాలన్నారు. పంట వేస్తే లాభాలు వచ్చేవిధంగా వ్యవసాయశాఖ ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లాలో 30ఏళ్ల క్రితం ఉద్యాన పంటలే లేవు, అయితే నేడు ఈ పంటల్లో జిల్లా ఆదర్శంగా ఉంది, ఇదే తరహాలో వ్యవసాయం విధానంలో కూడా మార్పులు రావాలన్నారు. సూక్ష్మసేద్యం లక్ష్యాలు పెరగాలన్నారు. ఈ జిల్లా హార్టికల్చర్ హబ్‌గా మారాలంటే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. జిల్లాలో వరి పంటకు బదులుగా ఇతర పంటలు సాగు చేసే విధంగా రైతుల్లో మార్పు రావాలన్నారు. ఏసీజన్‌లో అయినా పంట ఏండి పోకూడదన్నారు. మంచి వర్షం వస్తే తూర్పు మండలాల్లో కూడా చెరుకు పంట సాగు చేసే విధంగా రైతులను చైతన్య పరచాలన్నారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం పెరగాలని, వ్యవసామ విధానంలో కూడా మార్పులు రావాలన్నారు. జిల్లాలో వేరుశనగ విత్తనాలు సకాలంలో పంపిణీ చేయాలని, అలాగే రైతులందరికి జిప్సమ్ అందించాలని తెలిపారు. రేయిన్ గన్స్‌ను 75 శాతం రాయితీతో ఇవ్వాలని నిర్ణయించామని, అయితే దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరగుతుందన్నారు. వరిని తగ్గించి నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలపై రైతులు ఆసక్తి చూపడం మంచిదన్నారు. క్షేత్రస్థాయి అధికారుల వద్ద ప్రతి రైతు వివరాలు ఉండాలని, నిర్ణయించిన లక్ష్యాలను అధిగమించక పోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది లక్ష పంట సంజీవని కుంటలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టు కొన్నామన్నారు. దీని వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పాడి పరిశ్రమపై కూడా ఎక్కువ మంది రైతులు ఆధార పడి జీవిస్తున్నారని వారికి అన్ని విధాలుగా సహకరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు విధిగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉండాలన్నారు. సూక్ష్మ నీటి సేద్యంకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో జెసి-2 వెంకట సుబ్బారెడ్డి, వ్యవసాయశాఖ జెడి విజయకుమార్, పశుసంవర్థకశాఖ జెడి శ్రీనివాసరావు, ఉద్యానశాఖ అధికారి ధర్మజ మండల స్థాయి అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

‘డివిజన్ బాట’లో సమస్యలు పరిష్కరిస్తాం
* చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ

చిత్తూరు, ఏప్రిల్ 27 : మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివిజన్ బాటలో నమోదయ్యే సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో డివిజన్ బాట కార్యక్రమాన్ని 1, 2వ డివిజన్లలో ప్రారంభమైయ్యింది. తొలుత 1వ డివిజన్‌లోని పూనేపల్లికాలని, పెద్దకొత్తూరు గ్రామాల్లో గ్రామ పంచాయ తీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూనేపల్లి కాలనీవాసులు తమకు బస్సు సౌకర్యం కావాలని, తాగునీటి సమస్యతో పాటు, ఎళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సిసిరోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం పెద్ద కొత్తూరు గ్రామంలోని శ్రీరాములగుడిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, మేయర్ కఠారి హేమలతలు అనంతరం గ్రామస్థులతో కాసేపు సమావేశమై సమస్యలపై చర్చించారు. తమ గ్రామానికి దారి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వెంటనే స్పందించి రోడ్డును నిర్మించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సత్యప్రభ స్పందిస్తూ రైల్వే గేటు సమస్య, స్థల సమస్యల కారణంగా దారి నిర్మాణం చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. రైల్వే అధికారులతో చర్చించి రానున్న జన్మభూమి కార్యక్రమంలోగా రోడ్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అదే డివిజన్‌లోని అగ్రహారం వద్ద నాలుగు ఎకరాల భూమిలో రు1.04 లక్షల నిధులతో మంజూరైన పార్కు స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం 2వ డివిజన్ పరిధిలో జరిగిన డివిజన్ బాటలో ప్రజలు ఇచ్చిన సమస్యలను నమోదు చేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, టిడిపి రాష్టన్రేతలు బద్రినారాయణ, వైవీ రాజేశ్వరి, కఠారి ప్రవీణ్, పార్టీ నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్, కార్పొరేటర్లు శ్రీకాంత్, నవీన్, సహదేవ, కంద, మున్సిపల్ డిఇ విజయ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ సర్వేయర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

‘ ముద్దు’ పేరే నాకో పెద్ద పదవి
* పదవులపై ఆశలేదు. ప్రజాసేవపై ఆసక్తి వీడలేదు: ఎమ్మెల్సీ గాలి వెల్లడి
తిరుపతి, ఏప్రిల్ 27: తన నామంలోని ముద్దే నాకో పెద్ద పదవి అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు విలేకరులతోమాట్లాడారు. టిటిడి ఛైర్మన్‌గా మిమ్మల్ని నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ ఎన్ టి ఆర్ కాలం నుంచి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మంత్రి పదవులతో పాటు అనేక పదవులు పొందానన్నారు. పదవులపై వ్యామోహం లేదని, ప్రజలకు సేవ చేయాలన్నదే ఆలోచన అన్నారు. ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతున్నాడు అని అంటేనే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి అధికారులైన ఐఎఎస్, ఐపిఎస్‌లు కూడా తన మాటకు గౌరవం ఇచ్చి పనులు చేస్తారన్నారు. తాను ఏనాడూ పదవులు అడగలేదన్నారు. ఇస్తే వద్దనలేదన్నారు. మోదీ ప్రధాని అవుతారని మీరెవరైనా భావించారా అని ఆయన విలేకరులను ప్రశ్నించారు. బిజెపిలో అద్వాని లాంటి మహానేత మోదీని ముఖ్యమంత్రి చేశారని, ఇపుడు ఆయన ప్రధాని అయ్యారన్నారు. అయితే అద్వానీ కాలేదు కదా అని ఆయన చమత్కరించారు. అద్వానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించారన్నారు. బాబ్రీ మసీదు సమయంలో అన్ని విధాలా ముందున్నారన్నారు. అందుకే హిందువులు బిజెపికి అండగా నిలబడి విజయాన్ని అందించారన్నారు. పదవులు వచ్చే సమయం ఆసన్నమైతే వాటంతట అవే వస్తాయన్నారు. ఇక రాష్ట్రాన్ని విభజించిన అనంతరం లోటు బడ్జెట్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ వైపు పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అహర్నిశలూ కృషిచేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీలకు ఎన్ టి ఆర్, చంద్రబాబునాయుడు పాలనలో జరిగినంత మేలు ఏ ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. అంతేకాకుండా ఎస్సీలను లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకునేవారని చంద్రబాబునాయుడు ఇది సాధ్యంకాదని చెప్పుకునే అభివృద్ధినికూడా సాధించే సత్తా ఉన్నవాడని అన్నారు. అందుకే విభజన ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనడుపుతున్నారన్నారు.