చిత్తూరు

నిత్యావసరాలు, మద్యం బాటిళ్లతో కొండెక్కుతున్న స్మగ్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 11: శేషాచల కొండల్లోని విలువైన ఎర్రచందనం వృక్షాలను నరికి అక్రమంగా తరలించడానికి స్మగ్లర్లు నెలరోజులకు సరిపడా ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులే కాకుండా మద్యం బాటిళ్ళతో అక్రమంగా కొండెక్కుతున్నారు. గతంలో శేషాచల కొండల్లో పట్టబడ్డ స్మగ్లర్ల వద్ద నుంచి ట్లాబ్లెట్లు, సిగరెట్లు, బీడీలు, అహారపదార్ధాలు పట్టుబడ్డాయి. అయితే గురువారం తెల్లవారు జామున 4.20గంటల ప్రాంతంలో హరితకాలనీ వద్ద స్మగ్లర్లను గుర్తించిన టాస్క్‌పోర్స్ సిబ్బంది వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో దాదాపు 20 మంది స్మగ్లర్లు వారిపై రాళ్ల దాడికి దిగారు. ఒక్కసారిగా టాస్క్ఫోర్స్ సిబ్బందిపై రాళ్ళదాడికి దిగిడంతో వారు వారుకూడా ఎదురుదాడికి దిగారు. ఈ పరిస్థితుల్లో స్మగ్లర్లు అక్కడ నుంచి అటవీప్రాంతంలోకి పారిపోయారు. కాగా టాస్క్‌పోర్స్ సిబ్బంది ఆప్రాంతంలో ఎర్రచందనం దుంగల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో స్మగ్లర్లు వదిలివెళ్ళిన బియ్యం, వంటనూనె, టమోటాలు, కందిపప్పు, ఎరగడ్డలు ఇతర నిత్యావసరాలతోపాటు మద్యం, బీరు బాటిళ్ళు, వాటర్ బాటిళ్లు, టాబ్లెట్లు లభించాయి. అంతేకాకుండా వారి వద్ద తాము నరికిన చెట్ల బరువును తూచేందుకు వీలుగా తమవెంట తెచ్చుకున్న రెండు వేయింగ్ మిషన్లు లభించాయి. అలాగే అక్కడ లభించిన ఇతర సామగ్రిని టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 50 పరోటాలు ఉన్నాయి. దీనిని బట్టి ఇప్పటికే శేషాచల కొండల్లో తిష్టవేసిన స్మగ్లర్లకు వీటిని అందించడానికి వీరు వెడుతున్నట్లుగా భావిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ తెలిపారు. వీరికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. వీరంతా తమిళనాడులో జవాది హిల్స్‌కు చెందిన వారని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఓ నాగరాజు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది ఈదాడుల్లో పాల్గొన్నారన్నారు. స్మగ్లర్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నిత్యావసరాలు, మద్యం, వాటర్‌బాటిళ్లు తదితరాలను మీడియాకు చూపించారు.
ఘనంగా తాళ్లపాక అన్నమయ్య
609వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, మే 11: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి తత్వాన్ని లోకానికి చాటిన తాళ్లపాక అన్నమాచార్యుల 609వ జయంతి ఉత్సవాలు గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సుమారు 50 మంది అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటల వరకు తిరుపతికి చెందిన జయంతి సావిత్రి భాగవతార్ అన్నమయ్య జీవితచరిత్రపై హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 6నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎం.దేవదాస్, జి.లావణ్య బృందం ఆధ్వర్యంలో గాత్ర సంగీత కార్యక్రమం జరిగింది.
మహతి క్షేత్రంలో...
తిరుపతిలోని మహిత కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు చెన్నైకి చెందిన కుమారి దీపిక బృందం గాత్ర సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ఉప కార్యనిర్వహణాధికారి శారద, అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చి అసిస్టెంట్ డాక్టర్ సి.లత, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.