చిత్తూరు

ద్వారకాతిరుమలలో 24, 25న హిందూ ధార్మిక సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 4: ద్వారకాతిరుమలలో ఈనెల 24, 25వ తేదీలలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తామని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు గజల్ శ్రీనివాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈనేపథ్యంలో ఆయన ఆదివారం ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణే ప్రధాన అజెండాగా నిర్వహించనున్న హిందూ ధార్మిక సమ్మేళనానికి వివిధ మఠ పీఠాధిపతులు హాజరవుతారన్నారు. ముఖ్యంగా శిధిలావస్థకు చేరుకుంటున్న దేవాలయాలను పరిరక్షించడంతో పాటు ప్రతి ఆలయంలోనూ ఆధ్యాత్మిక చింతన పెంచేలా కృషిచేస్తామన్నారు. భారతదేశంలో అనేక శాసనాలున్నాయని, అవన్నీ కూడా రాళ్లపై నిక్షిప్తమై ఉన్నాయన్నారు. వాటిని పరిరక్షించడం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న త్రీ డి సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని రికార్డుచేసి పురావస్తుశాఖ ఆధ్వర్యంలో భద్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నేటి ఆధునిక సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కొత్త కొత్త భద్రతా విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఒక భక్తుడు ఒక ఆలయానికి వస్తే ఆ భక్తుడు ఎన్ని ఆలయాలు దర్శించాడో గుర్తించగలిగిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. ఇందుకు ‘ఐబాల్స్’ టెక్నాలజీని ఆలయాల్లో అమలుచేయడానికి దృష్టి సారిస్తున్నామన్నారు. అలాగే సౌరశక్తి ప్రయోజనాలను ఆలయాల్లో ఎలా ఉపయోగించాలి అన్న అంశంపై కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు. ఇక గోగ్రామాలను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎందుకంటే బలహీనపడ్డ గోవులను కళేబరాలకు తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా గో సంరక్షణ కోసం గో గ్రామాలను ఏర్పాటుచేయనున్నామన్నారు. గజల్ శ్రీనివాస్ వెంట బై అండ్ సేవ్ మధు తదితరులు ఉన్నారు.