చిత్తూరు

అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 15: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు వెళ్తూ శ్రీ కాళహస్తిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు కోలా ఆనంద్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాల వారిని, కులాల వారిని సమానంగా చూడాలని అంబేద్కర్ చెప్పిన మాటలను అందరూ గుర్తించుకోవాలన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పేదలకు కూడా హక్కులు కల్పించాల్సి ఉందని తెలిపారు. విద్య ఉంటే ఆర్థిక అసమానతలు పోతాయని, దీని కోసం అందరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో ప్రధాని నరేంద్ర మోడీ పయనిస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. పేదలకు బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 3.26కోట్ల మందికి రుణాలు ఇప్పించామని వివరించారు. సురక్ష బీమా ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశించిన సమ సమాజాన్ని స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే కాంగ్రెస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోందని తెలిపారు. విద్యార్థి నాయకుడు రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని, విశ్వవిద్యాలయాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం తగదన్నారు. శ్రీ కాళహస్తిలో శివాలయం, పవిత్రమైన స్వర్ణముఖి నది తిరుపతి నగరానికి పక్కనే ఉండటం వల్ల అమృత పథకం కింద ఎంపిక చేశామని, దీనివల్ల పట్టణం త్వరలోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక పార్టీ నాయకులు రమేష్, సుకుమార్, అరవింద్‌రెడ్డి, ముత్తు, పుష్ప, కిషోర్, ప్రకాష్ పాల్గొన్నారు.