చిత్తూరు

కాపుల సంక్షేమానికి నిరంతర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో బలిజ, కాపుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తానని అఖిలభారత కాపు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వూకా విజయ్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో సమాఖ్య జాతీయ, రాష్ట్ర, జిల్లా సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వూకా విజయ్‌కుమార్‌తోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను బలిజ, కాపునాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు మాటలతోనే మోసం చేశాయన్నారు. అయితే టిడిపి జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని అన్నారు. బలిజలను బిసి జాబితాలో చేర్చుతానని ఇచ్చిన హామీ మేరకు కమిషన్ వేసి అందరి అభిప్రాయాలను సేకరించారని తెలిపారు. ప్రతి జిల్లాలో కాపు సంక్షేమ భవనాలను నిర్మిస్తున్నారని, ఇందులో భాగంగా తిరుపతిలో నడిబొడ్డున స్థలం కేటాయించారని అన్నారు. నిరంతరం బలిజ, కాపుల సంక్షేమానికి ఆయన కృషి చేస్తున్నారన డానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే నిదర్శనమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని బలిజ, కాపు సోదరులు టిడిపి ప్రభుత్వం వెంట నడిచి మద్దతు ఇవ్వాల్సి ఉందన్నారు. మన కోసం పనిచేసేవారికి అండగా నిలిచినప్పుడే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని వివరించారు. తనకీ పదవిని ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇతర సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజులు మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, జాతీయ ఉపాధ్యక్షులు రాజమాస్టర్, కార్యదర్శులు నాగేశ్వరరావు, గోపినాథ్, శివరాం, సిహెచ్ కోటేశ్వర రావు, శ్రీనివాసులు, జివి రమణ, రవీంద్ర, రామకృష్ణ, మోహన్, ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, శ్రీనివాసులు, జాతీయ అధికార ప్రతినిధి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అచ్యుతకుమార్, సింగంశెట్టి సుబ్బరామయ్య, బాబూరావు, అనంతయ్య, మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశాలత, యువజన విభాగం అధ్యక్షుడు శివరాయల్, వెంకట ప్రసాద్, సరితా నాగరాజు, కొండాహరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వాడకం భావితరాలకు శాపం
* బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి హెచ్చరిక
తిరుపతి, సెప్టెంబర్ 17: పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని లేకుంటే భావితరాలకు అది శాపంగా మారుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక బైరాగిపట్టెడలోని బిజెపి కార్యాలయం నుంచి సేవా దివస్ కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ నాయకురాలు శాంతారెడ్డి ప్రారంభించారు. అక్కడ నుంచి ఆర్సీ రోడ్డు, కర్నాల వీధి, భేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా నాలుక్కాళ్ల మండపం వరకు రోడ్లపై పడివున్న ప్లాస్టిక్ కవర్లు, కప్పులను తొలగించారు. ఈసందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ మనం వాడుతున్న ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్రముపు తప్పదన్నారు. భూమిలో వందల సంవత్సరాలైన కలిసిపోని ప్లాస్టిక్ వల్ల కలిగేనష్టాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో చెప్పిన విధంగా అక్టోర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత భారత్‌తోపాటుగా వివిధ సేవ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాలిపుష్పలత, తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ నేసనూరి మోహన్, జిల్లా ప్రచార కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి, జిల్లా కోశాధికారి అక్కినపల్లి మునికృష్ణయాదవ్, విద్యావిభాగం జిల్లా కన్వీనర్ విష్ణువర్థన్ రెడ్డి, దళితమోర్చ నగర అధ్యక్షుడు రవిప్రసాద్, బిజెపి ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్, జిల్లా కన్వీనర్ సతీష్‌కుమార్, నాయకులు ఆటుపాకం గోపి, నారాయణ రెడ్డి, పణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.