చిత్తూరు

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం ఆనందంగా వుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సామాన్యులకు అందుతుండటం ఆనందంగా ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్ బైరాగిపట్టెడలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ ఇన్‌చార్జ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్‌వర్మ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈకార్యక్రమం జరిగింది. మంత్రితోపాటు ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం అందించిన వివిధ పథకాలను తెలియజేస్తూ ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ఈసందర్భంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, లేదా అంటూ మంత్రి చిరు వ్యాపారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్లో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు చెప్పారన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయని, ఈవిషయాన్ని పార్టీ నాయకులు గుర్తించడానికే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ఇప్పటికీ ఎవరికైనా అందకుంటే వారికి అందేలా చేయడానికి నాయకులు కృషి చేయాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి వెంటనే ప్రభుత్వ పథకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఆశయంతో ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, దానిని నిజం చేయడానికి జిల్లాల్లో ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు నాని, టిడిపి రాష్ట్ర మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ ఆశాలత, పుష్పావతి యాదవ్, గుణశేఖర్, మనె్నం శ్రీనివాసులు, రాము, గురుమూర్తి, భారతి, భూవమ్మ, సీమకుర్తికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవ సంబరాలు ఎప్పటికప్పుడు భక తప్రపంచానికి తెలియజేయండి

తిరుపతి, సెప్టెంబర్ 23: శ్రీవారి సాలకట్లబ్రహ్మోతవాల వైభవాన్ని, ఇతర విశేషాలను ఎప్పటికప్పుడు భక్తప్రపంచానికి తెలియజేయాలని టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమలలోని రాంభగీచా -2 విశ్రాంతి గృహాల్లో ఏర్పాటు చేసిన మీడియా ఎంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకోసం చేపట్టిన ఏర్పాట్లు, సౌకర్యాలు గురించి విస్తృతంగాప్రచారం చేయాలన్నారు. ఎక్కువ మంది భక్తులు సద్వినియోగం చేసుకునేలా చేయాలన్నారు. మీడియా సెంటరల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఫ్యాక్స్,టెలిఫోన్ వసతి కల్పించామని అన్నారు. టిటిడి ఏర్పాట్లపై సూచనలు, సలహాలు అందించాలని తప్పక పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని అన్నారు.కార్యక్రమంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, సివి ఎస్వీ ఆకె రవికృష్ణ, టిటిడి పి ఆర్వో డాక్టర్ టివి రవి, సహాయప్రజాసంబంధాల అధికారిణి కుమారి నీలిమ, సూపరింటెండెంట్ జయగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో పలు ప్రదర్శనలు ప్రారంభించిన టిటిడి ఇ ఓ సింఘాల్
శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనశాలలను టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా టిటిడి ఇ ఓ మాట్లాడుతూ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్, ప్రచురుణల ప్రదర్శనల, విక్రయం, ఉద్యావన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల,్ఫర్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమూలికా ప్రదర్శనను ప్రారంభించారు. ఎస్వీ మ్యూజియం ప్రదర్శన, ఎస్వీ శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళాప్రదర్శన, ఎస్వీ బధిరోన్నత పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేశామన్నారు. ఈకార్యక్రమంలో తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, సివి ఎస్వో రవిరాజు, ఎస్ ఇ రామచంద్రారెడ్డి, పి ఆర్వో రవి, ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
ప్రత్యేక ఆకర్షణగా ఉగ్రనరసింహుని సైకత శిల్పం
తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. మైసూరుకి చెందిన గౌరి, నీలాంబరిలు ఈశిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇందుకు మూడున్నర ట్రక్కుల ఇసుకను వినియోగించారు.గత నాలుగేళ్ళుగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వీరు సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు.