చిత్తూరు

గజవాహనంపై ఊరేగిన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, సెప్టెంబర్ 23: చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మదేవత దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గజవాహనంపై ఊరేగుతూ ప్రజలకు దర్శనభాగ్యం శనివారం కలిగించారు. శనివారం శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, వివిధరకాలైన పుష్పాలతో వైభవంగా అలంకరించారు. అనంతరం పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు దర్శనానికి అనుమతించి తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం ఆలయ ఆవరణంలో గజ వాహనంపై అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని ఉంచి గజలక్ష్మి అలంకరణ చేశారు. ఊరేగింపులో భాగంగా మేళతాళాలు, భజన బృందాలు తదితరులు ముందు నడువగా అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి తిమ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆర్టీసి బస్టాండ్ వద్ద ఎలక్ట్రానిక్ ఎల్ ఇడి డిస్‌ప్లే ప్రారంభం
తిరుపతి, సెప్టెంబర్ 23: తిరుపతికి వచ్చే ప్రయాణికులు,యాత్రికులు, ప్రజల సౌకర్యార్థం స్థానిక ఆర్టీసిబస్టాండ్ వద్ద తిరుపతినగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఎల్ ఇడి డిస్‌ప్లే బోర్డును శనివారం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించారు. ఇందులో తిరుపతి ఉష్ణోగ్రతలు, వర్షసూచన, గాలిలో తేమ, గాలివేగం, జిల్లాలోని ముఖ్య సందర్శనీయ స్థలాలు, శ్రీవారి బ్రహ్మోత్సవ సమాచారం ఇతర వివరాలు ఇందులో ఉంటాయి. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి నగరపాలక సంస్థకమీషనర్ హరికిరణ్, తుడా చైర్మన్ నరసింహయాదవ్, తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్,జాయింట్ కలెక్టర్ గిరిషా, మదనపల్లి సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు.