చిత్తూరు

చిత్తూరులో భానుడి ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 15: నగరంలో ఉదయ భానుడు ఉగ్రరూపం చూపుతుండడంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. గత మూడు రోజులుగా ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9గంటలకే ఉదయ భానుడు భగ భగలతో నగర వాసులు హడలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. నగరంలో గత మూడు రోజులుగా సుమారు 40నుండి 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 40ఏళ్లుగా ఇంతటి ఉష్ణోగ్రతలు నగరంలో నమోదు కాలేదని తొలిసారిగా ఈ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు నగర వాసులు వాపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన నగర ప్రజల్లో నెలకొంది. ఉదయం 9గంటలకే రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మూగ జీవాల బాధలు వర్ణనాతీతంగా మారాయి. వడగాల్పులు కారణంగా వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకు వడదెబ్బకు గురై మృత్యువాత పడే వారి సంఖ్య, నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. రోడ్డుపైకి రావడానికి జనాలు హడలి పోతున్నారు. ఎండలు రోజురోజుకు ముదురుతుండడంతో ఈ పరిస్థితి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని అందరిలోను భయాందోళన నెలకొంది.
ఎండల కారణంగా సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్
ఎండలు తీవ్రత ఎక్కువుగా ఉన్న కారణంగా ఈనెల 18న సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో ఎండలు తీవ్రత ఎక్కువుగా ఉంటుందని విపత్తు నిర్వహణశాఖ తెలియ చేసిందని పేర్కొన్నారు. ఈపరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజావాణిని రద్దు చేసినట్లు వివరించారు. అర్జీదారులు సోమవారం అర్జీలతో కలెక్టర్ కార్యాలయానికి రానవసరం లేదని తెలిపారు.