చిత్తూరు

‘బడుగుల కోసం తెలుగుదేశం ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, సెప్టెంబర్ 23: బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీరామారావు ఏర్పాటుచేశారని వైస్ ఎంపిపి మధుసూధన్ రెడ్డి అన్నారు. నడవలూరు గ్రామంలో శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వైస్ ఎంపిపి మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అనతికాలంలోనే అధికారానికి వచ్చి పేదవాడికి రూ.2 కిలో బియ్యంతో మూడుపూటలా ముద్దనిచ్చిందన్నారు. ప్రజలలో రాజకీయ చైతన్యం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని గుర్తించారు. ఎంపిపి బింధుమాధవి మాట్లాడుతూ మహిళలలో స్వాలంబన చంద్రబాబునాయుడుతోనే ప్రారంభమైందని, డ్వాక్రా గ్రూపులను ప్రారంభించి మహిళలకు చక్కటి వేధికను ఇచ్చింది తెలుగుదేశమే అన్నారు. మహిళల పేరుతో గృహాలు, రేషన్‌కార్డులు, రుణాలు మంజూరుచేసిన ఘనత తెదేపాదేనని వివరించారు. జిల్లా ఉపాధ్యక్షులు నీలకంఠ చౌదరి మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఆర్థిక పరిపుష్టిని కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పథకాలను రూపొందించి అమలుచేస్తున్నదన్నారు. ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఓ వృద్దురాలితో మాట్లాడుతూ పింఛను ఇప్పించడానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దేవానందం, మండల పార్టీ అధ్యక్షుడు లీలామోహన్, నాయకులు జయచంద్ర, నరసింహారెడ్డి, ఉమాపతి, చిట్టిబాబు, రామిరెడ్డి, బాలకృష్ణ, గిరినాయుడు, గరుడాద్రి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై విచారణ జరిపించాలి

చిత్తూరు, సెప్టెంబర్ 23: జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణంపై విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని పలువురు జడ్పీటిసి సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరులో జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, వైస్ చైర్మన్ సుందరామిరెడ్డి, ఇతర స్థాయి సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో పలువురు జిల్లా అధికారులు ఈ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. దీంతో ద్వితీయ శ్రేణి అధికారులతో ఈ సమావేశాలు నిర్వహించడంతో జడ్పీటిసిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సమావేశాలు నామమాత్రంగా కొనసాగాయి . ఈ సందర్భంగా పలువురు జడ్పీటిసి సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛ్భాతర్ మిషన్ ద్వారా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో కిందిస్థాయి అధికారులు లబ్ధిదారులను అనేక రకాలుగా వేధిస్తున్నారని, అనేక చోట్ల నిర్మాణాలు పూర్తయినా ముడుపులు ఇవ్వనందుకు బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపించారు. పలు గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయి సంవత్సర కాలమైనా నేటికీ బిల్లులు చెల్లించక, ఇవి పాత మరుగుదొడ్లు అంటూ లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. వెంటనే పూర్తయిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లించడంతో పాటు ముడుపుల విషయంగా కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డార్క్ ఏరియా ప్రాంతాలపై ఉన్న అంక్షలను తొలగించాలని పలువురు జడ్పీటిసి సభ్యులు విన్నవించారు. పలువురు సభ్యులు గ్రామాల్లో విద్యుత్ కోతలు విధించడంపై ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు. జిల్లాలోని పలు మండలాల్లో ఇటీవల అనేక అభివృద్ధి పనులు చేసినా బిల్లు మంజూరు కాకపోవడంపై పంచాయతీరాజ్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ రాజ్ అధికారులు వ్యాట్ మినహా ఎలాంటి పన్నులు వేయడం లేదని, అయితే జిఎస్‌టిపై ఇంతవరకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. నిధుల లేకనే బిల్లులు పెండింగ్‌లో పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని, నిధులు వచ్చిన వెంటనే పెండిగ్ బిల్లులు చెల్లిస్తారని తెలిపారు. అయితే కోరం లేక మూడవ స్థాయి సంఘ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాల్లో జడ్పీ సిఈవో రవికుమార్, పలువురు వివిధ శాఖలు అధికారులు, జడ్పీటిసి సభ్యులు పాల్గొన్నారు.