చిత్తూరు

‘శ్రీవారి సేవ ద్వారా తోటి భక్తులకు సేవలందించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబరు 12: తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి సేవా వ్యవస్థలో నమోదుచేసుకోవడం ద్వారా దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న తోటి భక్తులకు సేవలందించాలని కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావుభక్తులకు పిలుపునిచ్చారు. తిరుచానూరులో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన పల్లకీ ఉత్సవంలో ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ భక్తులకు శ్రీవారి దర్శనం , బస, అన్నప్రసాదం తదితర వసతులతో పాటు విద్యా,వైద్యం తదితర సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సేవలందించేందుకు 15 యేళ్ల క్రితం శ్రీవారి సేవావ్యవస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1500 నుంచి 2500 మంది వరకు శ్రీవారి సేవకులు తిరుమల, తిరుపతిలలో భక్తులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. వీరు క్యూలైన్లక్రమబద్దీకరణ, అన్నప్రసాదం పంపిణీ, లడ్డూ ప్రసాద వితరణ, పరకామణి తదితర సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవాభావం కలవారు 10 నుంచి 25 వరకు ఒక బృందంగా ఏర్పడి తమ పేర్లను నమోదుచేసుకోవచ్చని ఈవో తెలిపారు. వీరికి టిటిడి ఉచితంగా వసతి కల్పిస్తున్నట్లు, పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులుకావాలని ఆయన కోరారు.
పాఠశాలల విలీనాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన
ఏర్పేడు,డిసెంబరు 12: ఏర్పేడు మండలంలోని నచ్చనేరి పాఠశాలను దుగ్గిపేరి గ్రామంలో, రాజులపాళెం పాఠశాలను మడిపాకం పాఠశాలలకు, గోపాలపురం పాఠశాలను ఇసుకతాగేలి పాఠశాలలో విలీనంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సామాజిక చైతన్యవేదిక మండల కన్వీనర్ రామ్మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నచ్చనేరి పాఠశాలలో 35 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మోడల్ స్కూల్ పేరుతో ఇక్కడి పాఠశాలను మూసేని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గిపేరి పాఠశాలలో విలీనం చేశారని తెలిపారు. పిల్లలు 3 కిలోమీటర్ల దూరం ఎలా వెళ్తారని ప్రశ్నించారు. వెంకటగిరి - ఏర్పేడు రోడ్డు మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ మార్గంలో ఎస్ ఎస్ కెనాల్‌కాలువ ఉందన్నారు. ప్రమాదాల బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే నచ్చనేరి, రాజులపాళ్యం, గోపాల పురం పాఠశాలలను ప్రారంభించకపోతే ఆందోళన ఉధృతంచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సామాజిక చైతన్యవేదికతో కన్వీనర్ రామచంద్రయ్య, పెంచులయ్య, శీను, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పాలకులు మారినా ప్రజా సమస్యలు తీరడంలేదు
తిరుపతి, డిసెంబర్ 12: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా సమస్యలు మాత్రం తీరడంలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి అన్నారు. స్థానిక బైరాగిపట్టెడలోని సిపిఐ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బూర్జువా పార్టీలు అధికారం కోసమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించడంలేదన్నారు. ప్రతి పక్షంలో ఉన్నంత సేపు ప్రజా సమస్యలపై మొసలి కన్నీళ్లు కార్చడం, అధికారంలోకి వచ్చాక ప్రజలను దోచుకోవడం పరిపాటిగా మారిందని అన్నారు. అధికార పార్టీల తీరుతో రాష్ట్రంలో 33శాతం పేదరికం ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సైద్ధాంతిక, రాజకీయ చైతన్యం పెంచుకోవాలని చెప్పారు. సి పి ఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ ఈనెల 26న సి పి ఐ 90వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సి పి ఐ నాయకులు చిన్నం పెంచలయ్య, ఎన్ డి రవి, పార్టీ కార్యవర్గ సభ్యులు, శాఖ కార్యదర్శులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

‘వన్‌మేన్ సర్వీసులను రద్దు చేయాలి’
పలమనేరు, డిసెంబర్ 12: పలమనేరు ఆర్టీసి డిపో ఎదుట శనివారం ఆర్టీసీ కార్మికులు వన్‌మెన్ సర్వీసు విధానాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేసారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగాల్లో ప్రమోషన్లతో పాటు డి ఎ చెల్లింపును వేగవంతం చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికులను అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడాన్ని మానుకొని, రెగ్యులర్ కార్మికులను ఎంపిక చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు గోపాల్, నాగరాజు పాల్గొన్నారు.

యుపి ఎంపి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి
*మదనపల్లెలో వౌనంగా ముస్లింల భారీర్యాలీ
*సబ్‌కలెక్టర్, డిఎస్‌పిలకు వినతిపత్రాలు
మదనపల్లె, డిసెంబర్ 12: ఉత్తరప్రదేశ్ లక్నో పార్లమెంట్ సభ్యులు అఖిలేష్‌తివారి ముస్లింల దైవం మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాక్యలు, తీవ్రపద జాలంతో యావత్ భారతదేశ ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతీశాయి. ఎంపి అఖిలేష్‌తివారిపై కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం మదనపల్లె పట్టణంలోని ముస్లిం మైనార్టీలు, మతగురువులు స్థానిక బెంగళూరు బస్టాండు జామియా మసీదు నుంచి ప్లేకార్డులతో అవెన్యూ రోడ్డు, టౌన్‌బ్యాంకు సర్కిల్, చిత్తూరు బస్టాండ వాల్మీకి సర్కిల్, గాంధీరోడ్డు, నిమ్మనపల్లె సర్కిల్ మీదుగా డిఎస్‌పి కార్యాలయానికి చేరుకుని డిఎస్‌పి రాజేంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ముస్లిం మతగురువులు, ముతవల్లీలు, ఎఐఎంఐఎం పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఎ మహ్మద్ ఆలీ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్‌ను కలుసుకుని ముందుగా స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఎంపి అఖిలేష్‌తివారి ఓ బహిరంగసభలో ముస్లింల ఆరాధ్యదైవం మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు వినతిపత్రం అందజేశారు. దీంతో మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికబత్రా మాట్లాడుతూ ముస్లింలు అందరూ ప్రశాంతత పాటించాలని కోరారు.
మదనపల్లెలో రెడ్ అలెర్ట్: ఉత్తరప్రదేశ్ ఎంపి ముస్లింల ఆరాధ్యదైవంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముస్లింలు, ముతవల్లీలు, మతగురువులు సైతం రోడ్డుపైకి రావడం ఎంపికి వ్యతిరేకంగా నినాదాల చేయడంతో పోలీసులు మొహరించారు. అంతేకాకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్ళవద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డిఎస్‌పి ప్రకటించారు.