చిత్తూరు

జిల్లాను కరవు రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 13: జిల్లాను కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్ధి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధంగా వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులో జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో మంచి వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో రానున్న రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతులకు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయం పెరిగే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు యాంత్రీకరణ దిశగా మక్కువ చాపాలని అందుకు లగ్రామాల్లో రైతులను చైతన్య పరచాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలు పట్ల రైతుల మక్కువ చూపే విధింగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో వరిసాగు నిలకడగా ఉంచి, తక్కువ పెట్టుబుడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగుచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలన్నారు. రైతులకు విత్తనాలు పంపిణీ సమయంలోనే స్పింకర్లు, డ్రిప్ పరికరాలను అందించి నీటి పొదుపుపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రైతు పంటకుంటలను నిర్మించుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని, రుణమాఫీ రైతుల ఖాతాల్లో సక్రమంగా జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో వ్యవసాయం లాభసాటి అయ్యే విధంగా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టి రైతుల ఆలోచనావిధానాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆధునిక పద్దతులపై రైతులకు అవగాహన కల్పించి వారిని చైతన్య పరిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ దిశగా వ్యవసాయశాఖ సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా పనిచేస్తే జిల్లాలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి విజయకుమార్, పలువురు డిడిలు మండల స్థాయి వ్యవసాయశాఖ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.