చిత్తూరు

కన్నతండ్రి పాలిట కాలయముడైన కన్న కొడుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 13: ‘‘కన్న కొడుకు ఉన్నత శిఖరాలు అందుకోవాలని, ఉన్నతమైన ఆలోచనతో ఎదగాలని, తద్వారా తన ప్రతి రూపాన్ని కొడుకులో చూసుకుని ఆనందపడాలని సగటు తల్లిదండ్రులు ఆశిస్తారు. అంతేకాదు.. తాను మరణిస్తే పెద్ద కొడుకు దహన సంస్కారాలు నిర్వహిస్తే పున్నామనరకం నుంచి విముక్తి లభిస్తుందని తల్లిదండ్రులు ఆశిస్తారు. అయితే డబ్బు ముందు కన్నప్రేమ తృణప్రాయమై జన్మనిచ్చిన తండ్రిని ఆస్తి కోసం చంపించిన ఓ కసాయి కొడుకు ఉదంతమిది. ఈ విషయం తెలిసిన సగటు తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న మమకారం కన్నా ఆస్తి విలువే ఎక్కువవుతుందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’’
తిరుపతిలో ఈ నెల 9వ తేదీన జరిగిన లాడ్జీ యజమాని రావూరి సత్యనారాయణ హత్య కేసును ఈస్ట్ పోలీసులు ఐదు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఆస్తి కోసం ప్రత్యర్థులు ఆయన్ను హతమార్చి ఉంటారని పోలీసులు తొలుత భావించారు. అయితే అది అపోహేనని నిర్ధారించుకున్నారు. అటు తరువాత ఆస్తి కోసం ఆశపడుతున్నవారిపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో సత్యనారాయణ పెద్దకొడుకు రావూరి చందు (25)పై కూడా దృష్టి సారించారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. చందు సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. చందును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్తికోసమే కిరాయి హంతకులతో చంపించినట్లు చందు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఈక్రమంలో ఈ హత్యలో భాగస్వాములైన చందుతోపాటు ప్రత్యక్షంగా హత్యాకాండలో పాల్గొన్న చందు స్నేహితులు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. డిఎస్పీ మునిరామయ్య, సిఐ రామ్‌కిషోర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రావూరి సత్యనారాయణకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయితే అవి సోదరుల అభ్యంతరాలతో వివాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన పరిధిలో ఉన్న ఆస్తులతో తన పెద్ద కుమారుడు చందుని ప్రయోజకుడిని చేయాలని సత్యనారాయణ తపించాడు. అందుకు అనుగుణంగానే చందుకి స్టేషనరీ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అయితే చందు విలాసవంతమైన జీవితం, స్నేహితుల సహవాసాలతో వ్యాపారం నష్టాలపాలైంది. రూ. 20లక్షల వరకు అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు కట్టలేక వత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో తన భాగం ఆస్తిని పంచమని తండ్రి సత్యనారాయణపై ఒత్తిడి పెంచాడు. ఇందులో భాగంగా పలు సందర్భాల్లో తల్లిదండ్రులతో చందు ఘర్షణ పడేవాడు. వివాదం పరిష్కారమైన తరువాత ఆస్తి పంపకాలు చేపడతానని సత్యనారాయణ తన పెద్ద కుమారుడు చందుకి నచ్చచెప్పాడు. చందుకి ఈ ప్రతిపాదన రుచించలేదు. అప్పులిచ్చినవారి ఒత్తిడి పెరగడంతో తండ్రిని హతమార్చాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో తాను వెళ్లే జిమ్‌కు వచ్చే తిరుపతికి చెందిన పాకాల దినేష్‌తో స్నేహం పెంచుకుని తన పథకాన్ని వివరించాడు. తన తండ్రి మరణిస్తే కోట్ల రూపాయల ఆస్తి తన సొంతం అవుతుందని దినేష్‌కి తెలిపాడు. అంతేకాకుండా తన తండ్రిని చంపితే బట్టల దుకాణం పెట్టిస్తానని, చంపడానికి రూ.5లక్షలు నగదు అదనంగా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో పాకాల దినేష్ అందుకు అంగీకరించి తన స్నేహితులు కుంట్రపాకం సాయికిరణ్‌తో సంప్రదించాడు. చందు తండ్రిని చంపితే తనకు వచ్చే మొత్తంలో మూడు లక్షలు ఇస్తానని సాయికిరణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాయి కిరణ్ తన స్నేహితుడైన గణేష్, హేమంత్ అలియాస్ విక్కీలతోపాటు లోకేష్‌లతో కలసి పథకం పన్నారు. ఇందులో భాగంగా ఉదయం వాకింగ్‌కు బయలుదేరిన సత్యనారాయణను అతి కిరాతకంగా నరికి చంపారు. చందును అనుమానించి విచారించడంతో హంతకులు పట్టుబడ్డారని, శుక్రవారం వద్ద వీరిని అరెస్టు చేసి సెక్షన్ 302 ఐపిఎస్ కింద హత్యకేసు నమోదు చేసినట్లు డిఎస్పీ మునిరామయ్య తెలిపారు.