చిత్తూరు

నవంబర్ 1 నుంచి ఇంటింటికి కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 17: రాష్ట్రంలో ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో యుపిఏ ప్రభుత్వం చేపట్టిన నిరుద్యోగ, పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలపట్ల ఇంటింటికి కాంగ్రెస్ నినాదంతో వెళ్లి ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తామని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. ఒకవైపు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న చంద్రబాబు తిరిగి ప్రజలను మభ్య పెట్టేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలను చేపట్టారన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉంటూ కూడా ప్రభుత్వ ధోరణిని దీటుగా ఎదుర్కోలేక పోతున్నారని, దీంతో చంద్రబాబు తనను ప్రశ్నించేవారే లేరనే అతి ఆత్మవిశ్వాసంతో ప్రజాకంఠక పాలనతో ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. ఈక్రమంలో బాబు మాయమాటలు, మాయాజాలాన్ని ప్రజలకు తెలియజేయాలని సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతిలో యుపిఏ ప్రభుత్వం ఉన్న సమయంలో తాను ఎంతో శ్రమించి రాయలసీమ పేద ప్రజల, నిరుద్యోగ యువతీ యువకుల సంక్షేమం కోసం చేపట్టిన ఏడు ప్రాజెక్టులపై తాను రూపొందించిన కరపత్రాలను అందిస్తానని పేర్కొన్నారు. ఏర్పేడు వద్ద మన్నవరం ఏర్పాటు చేస్తే లక్షలాది మంది స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, దీనిని బాబు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతికి 12వేల ఇళ్లను యుపిఏ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల పేరుతో మంజూరు చేసిందన్నారు. రూ. 292 కోట్లతో 7008 ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. అయితే కట్టిన ఇళ్లకు సున్నం కొట్టించి ఇందిరమ్మ గృహాల పేరుతో ఉన్న పథకాన్ని ఎన్టీఆర్ గృహ కల్ప అని పేరు మార్చి ఇది తన ప్రభుత్వ విజయమని చెప్పుకుంటున్న ఘనుడు చంద్రబాబు నాయుడని దుయ్యబట్టారు. రూ.120 కోట్ల వ్యయంతో యుపిఏ పాలనలో అప్పటి కేంద్ర మంత్రి జయరామ్ రమేష్ పునాది వేసిన క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరుకి ఎందుకు బదలాయించారో చెప్పాలన్నారు. తిరుపతిలో అంతర్జాయ స్థాయి క్రికెట్ ప్రమాణాలతో నిర్మించడానికి రూ.30 కోట్లను మంజూరు చేసి, శిలాఫలకం కూడా వేశామన్నారు. ఇప్పటి వరకు వాటి నిర్మాణంపై ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఒక్క విమానం ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఎగిరిందిలేదు, వచ్చి దిగింది లేదని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో బాబు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చాటి చెప్పడానికే ఈ ఏడు ప్రాజెక్టులపై తాను రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికి కాంగ్రెస్ నినాదంతో ప్రజలకు తెలియజేస్తానని అన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడం రాక్షసత్వం అన్న చంద్రబాబు ఆయన ఏం చేస్తున్నారో ప్రజలకు చాటిచెప్పడమే తన ఆలోచన అని తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తాను పై చెప్పిన అభివృద్ధి పనులను ఎందుకు అమలు చేయలేదో స్వయంగా ఆయనే చెప్పాలన్నారు. మధ్యలోనున్న వారితో చెప్పిస్తే తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు దీనిపై ప్రకటన చేయాలన్నారు. లేనిపక్షంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి బాబు మాయాజాలం గురించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, పిసిసి కార్యదర్శులు ఎన్ శ్రీనివాసులు, ప్రమీలమ్మ, ఎస్సీ సెల్ నేత పూతలపట్టు ప్రభాకర్, భారతి, సావిత్రి యాదవ్, శాంతి, తేజోవతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యాలపాలై మృత్యువాత పడుతుంటే రాష్ట్భ్రావృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య వైద్య పరీక్షలు చేసుకోవడం కోసం లండన్ పర్యటనకు వెళుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. మోదీ పాలనతో దేశప్రజలు విసిగి పోయారని, అందుకే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం తన అంచనా ప్రకారం రానున్న ఎన్నికల్లో 272 ఎంపి స్థానాల్లో 170 బిజెపి, దాని మిత్రపక్షాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూడా ఒక కొత్తముఖాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. విదేశాలకు ప్రత్యేక విమానంలో వెళ్తున్న బాబు మాయ మాటలను, మాయాజాలాలపై ప్రధాని నరేంద్రమోదీ ఒక కనే్నసి ఉంచారన్నారు.