చిత్తూరు

ఇంజినీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: టిటిడి జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం ఆయన టిటిడి సీనియర్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో భక్త్భివాన్ని మరింత పెంచేలా విద్యుత్ అలంకరణలు చేపట్టేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. తిరుమలలోని పలుప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేందుకు వీలుగా వివిధ భాషల్లో సూచిక బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఫోన్లు పనిచేయని పక్షంలో వెంటనే మార్పు చేయాలని, మరమ్మతులకు గురైన ఫ్యాన్లను మార్చాలని ఆదేశించారు. కంపార్టుమెంట్లలో వర్షపునీటి లీకేజీని అరికట్టాలన్నారు. చెక్‌లిస్ట్ ప్రకారం కంపార్ట్‌మెంట్లలోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఇఓ స్పష్టం చేశారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకునేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. తిరుమలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుగా దేశంలోని నిష్ణాతుల నుంచి సలహాలు తీసుకుని నివేధిక రూపొందించాలని ఇఓ ఆదేశించారు. భక్తులు లడ్డూల కోసం ఎక్కువ సేపు వేచి ఉండకుండా కౌంటర్ల వద్ద చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయం, పోటు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లో విద్యుత్, మెకానికల్ వైర్లు బయటకు కనిపించకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ-ఫైలింగ్‌ను దశలవారీగా అన్ని విభాగాలకు విస్తరించాలన్నారు. ఇప్పటి వరకు టిటిడిలో జరిగిన ఈ-ఫైలింగ్‌ను ఇఓ సమీక్షించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల్లో ప్రదర్శించే కళాబృందాలకు అవసరమైన ఆడియో సామగ్రిని సమకూర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో తిరుమల, తిరుపతి జెఇఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, సివిఎస్వో ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏ, సిఏఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఇఓ గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.