చిత్తూరు

సంక్షేమ పథకాలపై అధికారులకు అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 23: రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలపై అన్నిశాఖల అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. సోమవారం జిల్లా స్థాయి నియోజకవర్గ, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలకు చెందిన అధికారులు కేవలం తమ శాఖకు చెందిన కార్యక్రమాలపైనే కాకుండా ఇతర శాఖలకు చెందిన కార్యక్రమాలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. దీంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సులభంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పలువురు అధికారులు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలుగా ఉన్న నేపధ్యంలో అన్ని శాఖలకు చెందిన పథకాలపై సమగ్ర అవగాహన ఉంటే క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. ముఖ్యంగా పంట సంజీవిని, వనం-మనం, నీరు-ప్రగతి , ఉద్యాన పంటలు తదితర కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. దీనిపై స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకొస్తే సులభంగా లక్ష్యాలను సాధించ వచ్చునని తెలిపారు. జిల్లాలో ఉన్న సర్పంచ్‌లను, కొందరు కాంట్రాక్టర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామాల పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమవంతుగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈదిశగా అందురూ కృషిచేసి లక్ష్యాలను సాధించాలని తెలిపారు. రాత్రి అధికారులతో మాట్లాడుతూ ఈనెల 27న ముఖ్యమంత్రి వివిధ కార్యక్రామాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని, అంతలోగా పలు రంగాల్లో ప్రగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల నాల్గవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నారని, ఇందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి- 2 చంద్రవౌళి పలువురు జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.