చిత్తూరు

వరదయ్యపాల్యెంలో ఎల్లోఫీవర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: జిల్లాలోని వరదయ్యపాల్యెంలో ప్రజలకు సోకుతున్న జ్వరాలు సాదాసీదా విష జ్వరాలు కాదని, ప్రమాదకరమైన ఎల్లోఫీవర్, లేదంటే ఎన్‌సైఫ్లాటిస్ జ్వరాలని, ఇది జాతీయ విపత్తేనని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. సోమవారం వరదయ్యపాల్యెంలో గత పది రోజుల వ్యవధిలో జ్వరాలతో మరణించిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా తిరుపతిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదయ్యపాల్యెంలోని ఒక్కో ఇంటిలో ఒకరిద్దరు మృత్యువాత పడ్డారన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 17 మంది చనిపోయినట్లు చెబుతున్నా, అనధికార లెక్కల ప్రకారం 70 మందికి పైగా మృత్యువాత పడి ఉంటారని చెప్పారు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఈ ప్రాంత ప్రజలకు సోకుతున్న జ్వరాలు డెంగ్యూనో, మలేరియానో కాదని అన్నారు. డెంగ్యూ జ్వరం ఎంత తీవ్రంగా సోకినా వారం రోజుల వరకు రోగులు మరణించరని తెలిపారు. వరదయ్యపాల్యెంలో జ్వరం సోకిన 48 గంటల్లో ప్రజలు మరణిస్తున్నారన్నారు. ఇది ఎల్లో ఫీవర్ అనే అనుమానం తనకు కలుగుతోందన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన జబ్బని, తక్షణం కేంద్ర వైద్యబృందాలు వరదయ్యపాల్యెంకు వచ్చి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. వరదయ్యపాల్యెంలో సోకుతున్న జ్వరాలకు ప్రధాన కారణం ఈ ప్రాంతంలో కల్కి భగవాన్ ఆశ్రమం, శ్రీసిటీలు ఉన్నాయన్నారు. ఇక్కడకు విదేశీయుల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయని, ఈనేపథ్యంలో వారి ద్వారా ప్రమాదకరమైన విష జ్వరాలు వరదయ్యపాల్యెం ప్రజలకు సోకి ఉంటాయనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. వరదయ్యపాల్యెంలో ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు పనిచేయడం లేదన్నారు. విషజ్వరాలు సోకిన ప్రజలు రక్త పరీక్షలు చేసుకోవాలన్నా ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించే పరిస్థితి కొనసాగుతోందన్నారు. దీంతో రక్తపరీక్షల ఫలితాలు వచ్చే లోపే బాధితులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. తక్షణం అక్కడ ఒక ప్రాధమిక వైద్య కేంద్రం ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. వరదయ్యపాల్యెం మండల పరిధిలోని 7 గ్రామాల్లో విష జ్వరాలు తీవ్రంగా ఉన్నాయని, ఇది మరో 15 గ్రామాలకు విస్తరించే అవకాశం ఉందన్నారు. ఇది మరిన్ని గ్రామాలకు విస్తరించి ప్రజల ప్రాణాలను తీయకమునుపే కేంద్రం స్పందించి చర్యలు తీసుకోవాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.