చిత్తూరు

మే 1 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జనన, మరణ ధ్రువీకరణ ప్రతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 16: జనన మరణ ధృవపత్రాలను వచ్చేనెల ఒకటోతేది నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇవ్వనున్నట్లు రాష్ట్ర జనన, మరణ నమోదు విభాగం అదనపుడిప్యూటి రిజిస్ట్రార్ చంద్రయ్య తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనన, మరణ ధృవపత్రాల మంజూరును ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. ఇందులో భాగంగా ఇకపై అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనన, మరణ ధృవపత్రాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుత వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగిన వెంటనే ధృవపత్రం ఇచ్చే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. గతంలో మున్సిపాలిటీలు, నగరపాలిక సంస్థల్లో ఈ పత్రాలు జారీ అయ్యేవని, దీని వలన ప్రజలు పలు ఇబ్బందులకు గురవతున్న నేపథ్యంలో మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం నేరుగానే ధృవపత్రాలు ఇచ్చేవిధంగా చర్యలు చేపడుతోందన్నారు. దీన్ని ప్రకారం అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో జనన, మరణ రికార్డు నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంబంధితదింత వైద్యులే రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. 100 శాతం జనన, మరణ ధృవపత్రాలు ఆన్‌లైన్‌లో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ త్వరితగతిన జరిగేలా నూతన సాప్ట్‌వేర్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లోని డాక్టర్లకు ఈనెల18 నుంచి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనన, మరణ ధృవపత్రాల నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయడం తదితర వివరాలను ఈ శిక్షణా కార్యక్రమాల్లో విశదీకరిస్తామన్నారు. గతంలో నగరపాలక సంస్థల్లో ఈ సర్ట్ఫికెట్‌ను పొందడంలో ప్రజల నుంచి పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నూతన పద్దతికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో బిడ్డపుట్టిన, లేక పలు కారణాలతో చనిపోయినా కుటుంబ సభ్యులకు ఆ సర్ట్ఫికెట్ నేరుగా అందించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ కోటేశ్వరి, పలువురు వైద్యశాఖాధికారులు పాల్గొన్నారు.