చిత్తూరు

కోవర్టులుగా వ్యవహరించి స్మగ్లర్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 19: నాడు నక్సలైట్లను పట్టుకోవడానికి పోలీసులు కోవర్టులను ఏర్పాటు చేసుకునేవారు. నేడు శేషాచల అటవీప్రాంతంలోని ఎర్రసంపదను దోచుకెళుతున్న స్మగ్లర్లను పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్ పోలీసులే కోవర్టుల అవతారం ఎత్తుతున్నారు. ఎర్రచందనం సంపదను దోచుకోవడానికి స్మగ్లర్లు శేషాచల అడవుల్లోని అన్ని మార్గాలను ఉపయోగించుకుంటూ టాస్క్ఫోర్స్ అధికారులను ముప్పుతిప్పలు పెట్టడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎర్రచందనాన్ని దేశ సరిహద్దులు దాటిస్తున్న విషయం విదితమే. ఈక్రమంలో ఎర్రసంపదను పరిరక్షించడానికి, స్మగ్లర్ల ఆటకట్టించడానికి టాస్క్ఫోర్స్ పోలీసులు వారి తలదనే్నలా వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఈక్రమంలో టాస్క్ఫోర్స్ పోలీసులే కోవర్టుల అవతారం ఎత్తుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కోవర్టు రూపంలో స్మగ్లర్లకు అవసర మైన ఆహార పదార్థాలను తీసుకెళ్లి ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం శేషాచల అడవుల్లోకి 14మంది స్మగ్లర్లు ప్రవేశించారు. వీరిని పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు అడవిలోకి తీసుకువెళ్ళిన నిత్యావసర వస్తువులు ఖాళీ కావడంతో స్థానిక దేవేంద్ర థియేటర్ సమీపంలోని మధు అనే వ్యక్తికి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు స్మగ్లర్ల కోసం ఏర్పాటు చేసిన నిత్యావర వస్తువులను స్థానిక గ్రాండ్ వరల్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళారు. నిత్యావసర వస్తువులు పంపుతున్నట్లు మధు వద్ద నుంచి సమాచారం అందించారు. దీంతో వేలూరు జిల్లా, పోలూరు తాలూకాకు చెందిన మురుగన్ (25) నిత్యావసర వస్తువుల కోసం అక్కడికి వచ్చాడు. అయితే అప్పటికే అక్కడ వేచి ఉన్న టాస్క్ఫోర్స్ సిబ్బంది అతనిని పట్టుకున్నారు. ఇది గమనించిన మరో వ్యక్తి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయాడు. మురగన్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది విచారిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజు, పిసిలు రమణ, రెడ్డెప్ప, సుధ, ప్రసాద్, మోహన్, రమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.