చిత్తూరు

పద్మావతీ అమ్మవారికి లక్ష్మీకాసుల హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 19: తిరుమలలో శ్రీవారికి ప్రతి పౌర్ణమి గరుడ సేవ రోజున అలంకరించే లక్ష్మీకాసుల హారాన్ని ఆదివారం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి సమర్పించారు. ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండరామారావు, ఓఎస్డీ పాలశేషాద్రిలు తిరుమలలో కాసులహారం ఊరేగింపును ప్రారంభించారు. అక్కడ నుంచి ఊరేగింపుగా ఉదయం 11 గంటలకు తిరుచానూరు రోడ్డులోని అర్బన్ హాట్ వద్ద తిరుపతి జేఈఓ పోలా భాస్కర్‌కు అందించారు. అనంతరం తిరుచానూరులోని పసుపుమండపానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభయాత్రగా ఆలయ మాడ వీధుల గుండా అమ్మవారి ఆలయంలోని తీసుకువచ్చి సమర్పించారు. ఈ సందర్భంగా జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ లక్ష్మీకాసుల హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా పద్మావతీ అమ్మవారికి అలంకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి మునిరత్నం రెడ్డి, విజిఓ అశోక్‌కుమార్ గౌడ్, ఏఈఓ రాధాకృష్ణ, ఎవిఎస్వో పార్థసారథి రెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారికి గొడుగులు సమర్పణ
తిరుచానూరులోని శ్రీపద్మావతీ అమ్మవారికి ఆదివారం 9 గొడుగులు, 2 ఆలవాలములు కానుకగా అందాయి. ఆదివారం చెన్నయ్‌కి చెందిన హిందూ మహాసభ ట్రస్టు ఛైర్మన్ వీరవసంత రాయల్, డైరెక్టర్ ఎ.రామ్‌లు ఆధ్వర్యంలో గొడుగులను, పట్టు వస్త్రాలను ఆలయ అధికారులకు అందించారు. గత 6 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న గొడుగులను అమ్మవారి గజ వాహన సేవకు వినియోగిస్తుండటం గమనార్హం.