చిత్తూరు

ముక్కంటి సేవలో శాసనమండలి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, డిసెంబర్ 7: రాష్ట్ర శాసన మండలి కమిటీ ఆన్ పేపర్స్ మేడ్ ఆన్ ది టేబుల్ కమిటీ ఛైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గురువారం శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. కమిటీ సభ్యులు చలపతిరావు, సుబ్బరామయ్యలతో వచ్చిన ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం తరువాత దక్షిణామూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వదించారు. ఈఓ భ్రమరాంబ తీర్థప్రసాదాలను అందజేశారు.
ఎస్‌ఎస్‌కెనాల్‌ను పరిశీలించిన జేసీ
తిరుపతి, డిసెంబర్ 7: జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా గురువారం ఏర్పేడు మండలంలోని ఎస్ ఎస్ కెనాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా హైజర్ కంపెనీ వారికి గంగాలపల్లి వద్ద 260 ఎకరాలు భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఎస్‌ఎస్ కెనాల్ కాలువకు సంబంధించిన పనులను కంపెనీకి కేటాయించిన స్థలంలో చేపట్టారు. దీంతో కంపెనీ అధికారులు ఈవిషయాన్ని జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈసందర్భంగా జేసీ పనులను జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి తహశీల్దార్ శేషగిరిరావుతో మాట్లాడుతూ మండల సర్వేయర్‌ను, కెనాల్ సంబంధిత సర్వేయర్‌ను పిలిపించి కాలువ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆధేశించారు. అనంతరం ఆయన తహశీల్దార్ కార్యాలయంలో వర్షానికి ఉరుస్తున్న రికార్డుల గదిని పరిశీలించారు.

‘ భవన నిర్మాణాల సమయంలో కొలతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి’
తిరుపతి, డిసెంబర్ 7: నూతన భవనాలు నిర్మించే యజమానులు తప్పనిసిరిగా అనుమతులు పొండంతోపాటుగా భవన కొలతలను తెలిపే ఫ్లెక్సీలను పనులుచేసే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్ జేడీ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని వైఎస్‌ఆర్ సమావేశ మందిరంలో నగరంలోని లైసెన్సు ఇంజినీర్లు, బిల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన విస్తీర్ణం 300 చదరపు మీటర్లు లోపైతే 3 అడుగులు ఎత్తు, వెడల్పుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే 10 అడుగుల వెడల్పు, ఎత్తులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. నగరపాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండా పనులు చేపట్టరాదన్నారు. అనధికార భవనాలను ప్రోత్సహించవద్దన్నారు. బిపిఎస్ పథకం ఆఖరు తేదీ ఈనెలాఖరులకు ముగుస్తుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టిపి అధికారులు గుణశేఖర్, బాలసుబ్రమణ్యం, సుభద్ర, మునిలక్ష్మి, రమేష్, తిరుపతి అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజినీర్ల సంఘం సభ్యులు పాల్గొన్నారు.