చిత్తూరు

రోజాకు పరువుంటే కదా.. కోర్టులో కేసు వేయడానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 7: వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు పరువు ఉంటే కదా.. తనపై పరువునష్టం దావా వేసేందుకు అంటూ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు. ముద్దుపై పరువునష్టం దావా వేస్తానంటూ రోజా హెచ్చరించిన నేపథ్యంలో గురువారం ఆయన పుత్తూరులో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి పైవిధంగా స్పందించారు. అలాగే తనపై పరువునష్టం దావా వేస్తే తానే స్వయంగా తన కేసును వాదించుకుంటానన్నారు. రోజాకు అసలు పరువులేదనే సాక్ష్యాధారాలను తాను కోర్టులో ప్రవేశపెడతానన్నారు. 1999లో ముఖన్ చంద్రగోత్రా అనే వ్యక్తి నుంచి అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆమెకు రూ. 5వేలు జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఒకరోజంతా కోర్డులో ఉండేలా శిక్ష విధించిందన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రోజా హైకోర్టుకు వెళితే రూ. 4లక్షలు జరిమానా విధించారన్నారు. హైదరాబాదులో బాచ్‌పల్లిలో ప్లాట్ ఇస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘనత రోజాదన్నారు. ఇలా మోసం చేసిన సొమ్ముతో మదనపల్లిలో భారీ షాపింగ్ మాల్ కడుతున్నారన్నారు. చిత్తూరుజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రోజా ఎలా మోసం చేస్తోందో త్వరలోనే బయటపెడతానన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్‌ను ఆమె హంతకుడిగా సంబోధించిందన్నారు. తానొక్కడే పార్టీ మారలేదని, ఆమె కూడా పార్టీ మారిందన్నారు. 33 సంవత్సరాలు నిజాయితీగా రాజకీయాల్లో జీవించానని, అందుకే ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం రోజాకు తగదన్నారు. నగరిలో ఆమె ఆనుచరులే అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ముద్దు విమర్శించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ యుగంధర్, ఎంపిపి గంజి మాధవయ్య, నాయకులు నరేష్, కరుణయాదవ్, జయప్రకాష్, రాజశేఖర్ వర్మ, ఎ.హరి, షణ్ముగరెడ్డి, మాధవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.