చిత్తూరు

మాస్టర్ ప్లాన్ బాధితులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, డిసెంబర్ 7: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలుకోసం బాధితులకు అంకణం స్థలానికి రూ.3.07లక్షలను ఇస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా స్పష్టం చేశారు. గురువారం దేవస్థానం కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ బాధితుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాధితులు అంకణం స్థలానికి రూ.3.50లక్షలను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఒక్కో ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి నగదు పరిహారంగా, లాడ్జీలు నష్టపోయిన వారికి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే విజయవాడలో భూసేకరణ సందర్భంగా బాధితులకు అంకణానికి రూ.3.07లక్షలను పరిహారంగా ఇచ్చారని, అదేవిధమైన పరిహారం శ్రీకాళహస్తిలో కూడా ఇస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. లాడ్జీల వారికి స్థలాలను ఇస్తామన్నారు. దీనిపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంకణం స్థలానికి రూ.3.50లక్షలను ఇవ్వాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రి వద్దకు వెళతామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3.07లక్షలని, అదనపు సొమ్ము ఇవ్వడం కుదరదని గిరీషా స్పష్టం చేశారు. అందరూ పేదవాళ్లేనని, అందరికీ న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జేసీని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం ట్రస్టుబోర్డు మాజీ అధ్యక్షుడు గురవయ్యనాయుడు, మార్కెట్‌కమిటీ అధ్యక్షుడు చెంచయ్యనాయుడు, టీడీపీ నాయకుడు సుధీర్ రెడ్డి, దేవస్థానం ఈఓ భ్రమరాంబ, ఈఈ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోటు ఆధునీకరణకై జేఈఓ సమీక్ష
తిరుపతి, డిసెంబర్ 7: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్యకు తగినంతగా లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా పోటును ఆధునీకరించడం తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు గురువారం ఇంజినీరింగ్, పోటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక టీటీడీ పరిపాలనాభవనంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డూల ఉత్పత్తిని పెంచేందుకు కావాల్సిన యంత్రసామగ్రి, మానవ వనరులు, పడిపోటు, అదనపు పోటుపై జేఈఓ సమీక్షించారు. సామర్థ్యానికి తగినట్టుగా ఆధునిక యంత్రాలను ఎలా ఉపయోగించుకుని నిర్వహణ లోపాలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్‌ఏసిఎఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, డిప్యూటీ ఈఓలు కోదండరామారావు, వేణుగోపాల్, పోటు పేష్కార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.