చిత్తూరు

ఆత్మహత్యలు సమస్యలు పరిష్కరించలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 7: మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం మాని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్సన్ నన్నపునేరి రాజకుమారి పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఇటీవల జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్ళు నాగరత్న, తిరుమల, భార్గవి, నిర్మలలు సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజకుమారి మాట్లాడుతూ మహిళలు ఆత్మధైర్యంతో ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఇలాంటి ఘటనల వల్ల అనేక కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నేడు దేశంలో అనేక మంది మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ దేశానికి కీర్తి తెచ్చారన్నారు. ఇలాంటి మహిళలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమస్యలు అందరికి ఉంటాయని అయితే వాటితో బాధపడకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉంటే ఎలాంటి దుర్ఘటనలనైనా సరే ఎదుర్కోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నేడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సమాజంలో సెల్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌లు తదితర ఆధునిక పరిజ్ఞానంతో యువత చెడు మార్గంలో పయనిస్తుందన్నారు. మహిళల కోసం అనేక చట్టాలు, హక్కులు ఉన్నాయని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు వినియోగం కాలక్షేపం కాకూడదని, వీటివల్ల అనేక అనర్థాలు జరుగుతుందన్న విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే గడుపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సీరియల్ తదితర ప్రభావం కూడా యువతపై పడుతుందన్నారు. ఇందులో ఏది మంచో ఏది చెడో గ్రహిస్తే ఆ కుటుంబం సజావుగా ఉంటుందన్నారు. మహిళలు క్షణికావేశానికి లోనుకావడం మానుకొని సుదీర్ఘంగా మనసుపెట్టి ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చన్నారు. చిత్తూరు జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లు చేసిన సైకిల్ సాహస యాత్ర రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మహిళలు - హక్కులు - చట్టాలపై మహిళా కమిషన్ తరుపున ప్రస్తుతం రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, యూనిర్శిటీలు, కాలేజిల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. అయితే ఇకపై గ్రామీణ ప్రాంత మహిళల్లో అత్మస్థైర్యం నింపే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. చిత్తూరు జిల్లాలో నల్గురు మహిళా కానిస్టేబుళ్లు గ్రామీణ ప్రాంత మహిళలను చైతన్యపరచడానికి చేపట్టిన సైకిల్ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో పల్లెలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ పలు కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా మహిళలల్లో మనోధైర్యం నింపడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించడానికి మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్‌యాత్ర స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఆడపిల్లలు అనుకుంటే దేనినైనా సాధిస్తారన్నారు. ముఖ్యంగా చదువుపట్ల మక్కువ చూపితే మంచి భవిషత్తు ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నివారణ కోసం తమ వంతుగా చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్న తరుణంలో మహిళా కానిస్టేబుళ్లు తాము సైకిల్‌యాత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తామని ముందుకొచ్చారని, వారి చొరవతోనే ఈ సైకిల్‌యాత్రను కొనసాగించామన్నారు. ఈ యాత్రకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లబించిందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులతో పాటు మహిళలు క్షణికావేశానికి లోనుకాకుండా ఒక సారి ఆలోచించుకుంటే ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడరన్నారు. ఈ దిశగా అందరూ ఆలోచించడం మంచిదేనన్నారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు మేయర్ కఠారి హేమలత, ఎఎస్పీ రాధిక, డాక్టర్ సుధారాణి, విద్యార్థులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన మహిళా కానిస్టేబుళ్ల సైకిల్ యాత్ర
* చిత్తూరులో మహిళా కానిస్టేబుళ్లకు ఘన సన్మానం

చిత్తూరు, డిసెంబర్ 7: జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి, మహిళా హక్కులు చట్టాలపై అవగాహన కల్పించడానికి జిల్లాకు చెందిన నల్గురు మహిళా కానిస్టేబుళ్లు చేపట్టిన సైకిల్ యాత్ర గురువారంతో ముగిసింది. అక్టోబర్ 24న జిల్లాకు చెందిన నిర్మల, తిరుమల, నాగరత్న, భార్గవిలు ఈ సైకిల్ యాత్రను చేపట్టారు. వీరి యాత్ర సుమారు 1200 కిలోమీటర్లు కొనసాగింది. వీరు గ్రామీణ ప్రాంతాల గుండా తమ సైకిల్ యాత్రను కొనసాగిస్తూ, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ గ్రామీణ మహిళలకు తమ హక్కులు, చట్టాలు, మహిళల కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చారు. మహిళల్లో అత్మస్థైర్యం నింపేందుకు జిల్లా పోలీసుశాఖ ద్వారా ఈ మహిళా కానిస్టేబుళ్లు చేపట్టిన సైకిల్ యాత్రకు విశేష స్పందన వచ్చింది. జిల్లాలో సుమారు 45 రోజులు పాటు సాగిన ఈ యాత్ర గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా వీరు చిత్తూరుకు చేరుకోగానే పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి మద్దతుగా నగరంలో పెద్దఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్ బాబు, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ కఠారి హేమలత, డాక్టర్ సుధారాణి, పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తదుపరి ఈసైకిల్ యాత్రలో పాల్గొన్న మహిళా కానిస్టేబుళ్లు నిర్మల, తిరుమల, నాగరత్న, భార్గవిలను ఘనంగా సన్మానించి వారి సాహస యాత్రను కొనియాడారు.

టాస్క్ఫోర్స్ సిబ్బందిని చుట్టుముట్టిన ఎర్రకూలీలు
* రాళ్ల దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం గాలిలోకి కాల్పులు
* ఐదు టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రేణిగుంట, డిసెంబర్ 7: మండల పరిధిలోని శేషాచల అటవీప్రాంతంలో చైతన్యపురం, తేండ్రగుంట మధ్యలో టాస్క్ఫోర్స్ సిబ్బందిని ఎర్రకూలీల దళం చుట్టుముట్టి రాళ్లదాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఎర్రకూలీలు దుంగలు వదలి పరారైన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. టాస్క్ఫోర్స్ ఎస్‌ఐ అశోక్ కథనం మేరకు రోజువారీ కూంబింగ్‌లో భాగంగా చైతన్యపురం, తేండ్రగుంట అటవీప్రాంతం మధ్యలో కూంబింగ్ చేస్తుండగా భారీ ఎత్తున ఎర్రచందనం కూలీలు దుంగలను పేరుస్తున్నారని చెప్పారు. మరో పక్క ఎర్రచందనం వృక్షాలను నరికివేస్తుండగా అదే సమయంలో టాస్క్ఫోర్స్ ఆర్‌ఐ సత్యనారాయణ నేతృత్వంలో 9 మంది సిబ్బంది తారసపడ్డారు. వీరిని గమనించిన ఎర్రకూలీలు ఒక్కసారిగా అదే ప్రాంతంలోని 80 నుంచి 100 మంది స్మగ్లర్లు టాస్క్ఫోర్స్ సిబ్బందిని చుట్టుముట్టి రాళ్ల దాడికి దిగారు. ఒక సమయంలో 9 మంది టాస్క్ఫోర్స్ సిబ్బందిని బంధించేందుకు స్మగ్లర్లు యత్నించగా, టాస్క్ఫోర్స్ సిబ్బంది ఎదురు తిరగడంతో వారిని అంతం చేసేందుకు రాళ్లదాడికి దిగారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది తమ వద్ద ఉన్న తుపాకులతో ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు తమ వద్ద ఉన్న దుంగలను వదిలి అటవీప్రాంతంలోకి పారిపోయారు. ఈ విషయాన్ని ఐజి కాంతారావుకు టాస్క్ఫోర్స్ సిబ్బంది తెలియజేయడంతో ఆయన 10 వాహనాల్లో ఐదు బృందాల టాస్క్ఫోర్స్ సిబ్బందితో అటవీ ప్రాంతానికి దుంగల మిట్ట వద్దకు చేరుకున్నారు. 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న స్మగ్లర్ల బ్యాగుల్లో తమిళనాడు ప్రాంతానికి చెందిన 80 మంది పేర్లు, వారు ఎన్ని దుంగలు తెచ్చారు, వాటి బరువును, రెండు ట్రిప్పుల లెక్కన రాసివున్న కాగితాలు లభించాయి. అలాగే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు, తమిళ హీరోయిన్లు సమంత, ఖాజల్, ఇతర తమిళ హీరోయిన్లతో స్టూడియోల్లో దిగిన ఫొటోలు, తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో స్వాధీనం చేసుకున్న దుంగలను తిరుపతిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. సంఘటనా స్థలంలో టాస్క్ఫోర్స్ బృందాల గాలింపు కొనసాగుతోంది.