చిత్తూరు

కనకమహాలక్ష్మీ అమ్మవారికి టీటీడీ సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: విశాఖపట్నంలో కొలువైవున్న సిరుల తల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి శ్రీవారి తరపున ఆలయ పేష్కార్ రమేష్‌బాబు గురువారం పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి అమ్మవారి ఆలయ ఈఓ ఎస్.జ్యోతి మాధవి స్వాగతం పలికి సారెను అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి టీటీడీ సారెను అందించింది. 10 సంవత్సరాలుగా టీటీడీ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తోంది.

ఎస్వీయూలో మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి
* రెక్టార్‌కు విద్యార్థి సంఘాల వినతి
తిరుపతి, డిసెంబర్ 14: విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నవారిపై అన్యమత ప్రచారాలు చేశారంటూ మత ఉద్రిక్తతలు సృష్టిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాధవక్రిష్ణ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు వారు గురువారం ఎస్వీయూ పరిపాలనా భవనం ముందు ధర్నా నిర్వహించిన అనతరం రెక్టార్ మచ్చ్భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం తమకు నచ్చిన పండుగులను, విశ్వాసాలను కలిగి ఉండటం హక్కన్నారు. ఎస్వీయూనివర్శిటీలో అనేక కులాలు, మతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని వారివారి విశ్వాసాల ప్రకారం పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. అయితే దీనిని పక్కదోవ పట్టిస్తూ ఓ విద్యార్థి సంఘం వారు బయటి వ్యక్తులను తీసుకువచ్చి ఆందోళన చేయడం సరికాదన్నారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందని, జరగరానిదేదైనా జరిగితే అందుకు వర్శిటీ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీ్ధర్, అనిల్, భూపతి, ఉదయ్, వీరేంద్ర, ఎంఎస్‌ఎఫ్ నాయకులు వీర, సురేంద్ర, శివ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీయూలో అన్యమతప్రచారంపై వీసీకి ఏబివిపి వినతి
క్రిస్మస్‌ను పురస్కరించుకుని వర్శిటీలో కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరుపుకున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సవరయ్య, తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ వెంకటరమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి నాయకులు ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరంకు వినతిపత్రం అందించారు. ఇది చట్టరీత్య నేరమని, మత విద్వేషాలు చెలరేగుతాయని ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏబివిపి జిల్లా కన్వినర్ టి.రాజేష్, కో కన్వీనర్ ఎన్.మహేష్‌బాబు, ప్రేమ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాసులు, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.