చిత్తూరు

అంతర్గత ఆడిట్ ద్వారా పారదర్శకత పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: టీటీడీలో క్రమం తప్పకండా అంతర్గత ఆడిట్ నిర్వహించడం ద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని, పాలన మరింత మెరుగుపడుతుందని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. స్థానిక టీటీడీ పరిపాలనాభవనంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రముఖ ఆడిటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల ద్వారా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల సరళి, నాణ్యత, భక్తుల స్పందన తదితర అంశాలపై సర్వే చేసి అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లోని దుకాణాల్లో విద్యుత్ చార్జీలు చెల్లించని వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని అన్నారు. టీటీడీలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లపై ఆడిట్ జరగాలన్నారు. తిరుమలలోని కాటీజీల్లో గదుల మరమ్మతులను త్వరగా పూర్తి చేసి వీలైనన్ని ఎక్కువ గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని రిసెప్షన్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా అపరాధం విధించాలన్నారు. ఈ సమావేశంలో జేఈఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, ప్రముఖ ఆడిటర్లు నరసింహమూర్తి, శరత్, ఎఫ్‌ఏసిఏఓ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, సిఏఓ రవిప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘టైమ్‌స్లాట్ విధానాన్ని విజయవంతం చేయాలి’
తిరుపతి, డిసెంబర్ 14: టీటీడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని సిబ్బంది సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని జేఈఓ శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. స్థానిక శే్వత భవనంలో గురువారం టీటీడీ అధికారులకు, సిబ్బందికి జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా టైమ్‌స్లాట్ టోకెన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సిబ్బందికి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో విధులు కేటాయిస్తామన్నారు. తిరుపతి నుంచి వచ్చే సిబ్బందికి టీటీడీ పరిపాలనా భవనం వద్ద నుంచి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, విజిఓ రవీంద్రారెడ్డి, 80 మంది సీనియర్ అధకారులు, 300 మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు.