చిత్తూరు

20 నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 14: జిల్లాలో ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం ఈ సదస్సుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ సదస్సులో భాగంగా ఎంఓయులు చేసుకోడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించడం, పరిశ్రమలకు కావాల్సిన భూ పంపిణీ, జాయింట్ రుణాలు, సింగల్ డెస్క్ పోస్టల్ ద్వారా అనుమతులు తీసుకునే విధి విధానాలు, రిజిస్ట్రేషన్, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, స్టాండ్ అప్ ఇండియా పీఎం ఈజీపీ పథకాలపై అవగాహన కల్పించడం వంటివి చేస్తామన్నారు. జిల్లాలోని 14 కేంద్రాల్లో ఈ అవగాహన సదస్సులు కొనసాగుతాయని తెలిపారు. 20న గంగాధరనెల్లూరు, 21న నగరి, పీలేరు, 22న పూతలపట్టు, మదనపల్లి, 23న తిరుపతి, పుంగనూరు, 26న కుప్పం, శ్రీకాళహస్తి, చంద్రగిరి, 27న బి.కొత్తకోట, సత్యవేడు, 28న పలమనేరు, చిత్తూరులో ఈ అవగాహన సదస్సులు జరుగుతాయని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 చంద్రవౌళి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు రవిప్రకాష్‌రెడ్డి, కూర్మానాథ్, జిల్లా అధికారులు గోపిచంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలి
* ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు డిమాండ్
తిరుపతి, డిసెంబర్ 14: రాష్ట్రంలో సకాలంలో పరీక్షలు నిర్వహించని కారణంగా 2016-17కు చెందిన డీఎడ్ విద్యార్థుల జీవితాలు అంధకారంగా మారాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే వారికి పరీక్షలు నిర్వహించి డీఎస్సీలో అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ డీఎడ్ విద్యార్థులకు 9 నెలల్లోనే పరీక్షలు జరగాల్సి వుండగా ఇప్పటికి 17 నెలలు అవుతున్నా నేటికీ పరీక్షలు జరగపోవడం దారుణమన్నారు. యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం డీఎడ్ పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్‌సీకి అప్పజెప్పడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుని వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు జయకుమార్, సూర్య, హేమంత్, సంతోష్, రామాంజి తదితరులు పాల్గొన్నారు.