చిత్తూరు

డేటా బేస్ ద్వారా పశువులకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: నేషనల్ వెటర్నరీ రిజిట్రీ, అనిమల్ ట్యూమర్ రిజిట్రీ వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒక డేటాబేస్ తయారవుతుందని, దీని ద్వారా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించవచ్చని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్.రవికుమార్ వెల్లడించారు. గురువారం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయంలో క్యాన్సర్ పరిశోధనల్లో నూతన పోకడలు, పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి, పునరుత్పత్తిపై వాటి ప్రభావం అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు, 41వ ఆన్యువల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ వెటర్నరీ సర్జరీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ మనష్యులలో వచ్చే క్యాన్సర్‌కు నివారణ ఉందని, అలాగే పశువులలో వచ్చే వ్యాధిని గుర్తించి, నిర్థారించి, నివారించేందుకు ఉన్న నూతన పరిశోధన అంశాలను ఒక వేదికపైకి తీసుకువచ్చి అవగాహన కల్పించడానికి ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు. పశువులలో ఒకసారి వాపు లేదా గడ్డ వచ్చి అది తగ్గకుండా పెద్దదిగా మారుతున్నప్పుడు చికిత్సకు ఎలాంటి స్పందన లేనప్పుడు, బరువుతగ్గుతూ మల, మూత్ర విసర్జనలను కష్టంగా చేస్తున్నప్పుడు అలాగే గడ్డ నుంచి రక్తం కారుతున్నప్పుడు దానిని క్యాన్సర్‌గా పరిగణించాల్సి ఉంటుందన్నారు. చర్మం, తల, మెడ, రొమ్ము భాగాలకు క్యాన్సర్ వస్తుందని, కొన్ని క్యాన్సర్‌లు తగ్గితే, కొన్ని మ్యూటేషన్ ద్వారా పరిణితి చెందిన కణాలను చచ్చుపడేటట్లు చేస్తాయన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వై.హరిబాబు మాట్లాడుతూ పశుజాతుల మధ్య కంపారిటివ్ స్టడీస్ అవసరమన్నారు. సింహాలలో యూరినో జెనిటల్ క్యాన్సర్ వస్తే, శునకాల్లో ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని వివరించారు. వీటికి కారణమవుతున్న జన్యువులను కనుక్కోవాల్సి ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో వెటర్నరీ క్యాన్సర్ రిజిట్రీని ప్రతిపాదించి ప్రవేశపెట్టనున్నామని, ప్రథమంగా ఆప్థామాలజీ విభాగాన్ని ప్రథమంగా ప్రవేశపెట్టనున్నానమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఐఎస్‌విఎస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.తిలగర్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ డి.బి.పాటిల్, వెటర్నరీ విభాగం డీన్ డాక్టర్ టి.ఎస్.చంద్రశేఖర్‌రావు, డాక్టర్ నళినీకుమారి, డాక్టర్ ఆర్.వి.సురేష్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సులో 200 పోస్టర్లు, 330 ఆబస్ట్రాక్ట్రులు ప్రచురించారు. ఈ సమావేశంలో సైంటిస్టులు డాక్టర్ మురళి, డాక్టర్ ఫాజల్, డాక్టర్ రాజేష్, డాక్టర్ వోనప్పగల్‌లకు ఫెలోలను మంజూరుచేశారు. తొలి రోజున 78 పరిశోధన పత్రాలు, 40 పోస్టర్లు ప్రజెంట్ చేశారు.