చిత్తూరు

ఘనంగా కనుమ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, జనవరి 16: సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో కనుమ సంబరాలను కోలాహలంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు పొంగళ్ళు, దీపారాదణ చేశారు. ఇళ్ల వద్ద పశువులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల మధ్యలోని నడి వీధిని అందంగా తోరణాలు, ముగ్గులతో అలంకరించి డప్పు వాయిద్యాలతో పశువులను పరుగులు పెట్టించారు. పశువులకు అలంకరించిన కాగితపు పూలు, చెరుకులను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీలు పడ్డారు.

ఘనంగా గంగమ్మ శిరస్సు ఊరేగింపు
బైరెడ్డిపల్లి, జనవరి 16: మండలంలో ఆదివారం రాత్రి పలు గ్రామాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని గంగమ్మ శిరస్సు ఊరేగించారు. మండలంలోని దేవదొడ్డి, గౌనితిమ్మినేపల్లి, గొల్లచీమనపల్లిలో గంగమ్మ శిరస్సుకు పలు రకాల పూలతో, ఆభరణాలు ధరింప చేసి గ్రామ పురవీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగించారు. ఈసందర్భంగా భక్తులు అమ్మవారికి హారతులు పట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
షార్ ఇస్రో ఇంటర్న్‌షిప్‌కు మిట్స్ విద్యార్థి ఎంపిక
మదనపల్లె, జనవరి16: నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ ఎస్‌డిఎస్‌సి షార్ ఇస్రో ఇంటర్న్‌షిప్‌కు చిత్తూరుజిల్లా అంగళ్ళు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మెకానికల్ తృతీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థి ఎస్.కె.రిజావుద్దీన్ ఎంపికైనట్లు తెలిపారు. ఇస్రో ఇంటర్నెషిప్‌కు ఎంపికైన విద్యార్థి షార్ ఇస్రోలో జరిగే వివిధ రాకెట్స్ ప్రయోగాలు, పరిశోధనలపై తెలుసుకుంటూ, రాకెట్ ప్రయోగానికి కావాల్సిన ఇంధనాలు , వాటిని నిల్వ చేసే విషయాలపై అవగాహన పొందుతారన్నారు. రాకెట్ ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారన్నారు. విద్యార్థి ప్రధానంగా సిలిండర్స్ లీక్ కాకుండా, లీకేజిని కనుగొని, దానిని ఎలా అదుపుచేయాలో, లీకేజ్‌ను కనుక్కోవడంపై ఇంటర్న్‌షిప్ చేయడానికి ఎంపికైనట్లు మిట్స్ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇస్రో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన మిట్స్ విద్యార్థి రిజావుద్దీన్‌ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, విభాగాధిపతి డాక్టర్ సూర్యనారాయణరాజు, సహచర విద్యార్థులు అభినందించారు.