చిత్తూరు

కల్లుపల్లిలో సిసి కెమెరాలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, జనవరి 16: మండలంలోని కల్లుపల్లి గ్రామంలో సోమవారం పలమనేరు డీ ఎస్పీ చౌడేశ్వరి ప్రారంభించారు. కల్లుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాలు, దారి దోపిడీలు జరగకుండా ఉండేందుకు ఈ సిసి కెమెరాలను పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారం రోజుల క్రితం కల్లుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడం, ముగ్గురు మృతి చెందడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాహన చోదకులు అప్రమత్తంగా నడుస్తారని ఆమె అన్నారు.
ప్రతి కుటుంబానికి ఆదాయం పెంపే ప్రభుత్వ లక్ష్యం
శాంతీపురం, జనవరి 16: ప్రతి కుటుంబ తలసరి ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పాడి ఆవులు, గొర్రెలు, కోళ్ళు పెంపకాల ద్వారా ప్రతి కుటుంబం నెలకు పది వేల రూపాయలు సంపాదన కలిగి ఉండాలని ముఖ్యమంత్రి భావించి ప్రతి 35 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తలసరి ఆదాయం పెంపు ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఎంపిక చేసిన సాధికార మిత్రలు, ప్రజాప్రతినిధులకు ఐదు పంచాయతీలకు ఒక చోట సమావేశాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి మణి, నాయకులు నాగరాజు, రామకృష్ణ, ఆంజనేయరెడ్డి, రాజారెడ్డిలు పాల్గొన్నారు.
ఆవుల కుప్పంలో 18న తెప్పోత్సవం
రామకుప్పం, జనవరి 16: మండల పరిధిలోని ఆవుల కుప్పం గ్రామంలో వైభవంగా తెప్పోత్సవం ఈనెల 18న నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో చెరువు వద్ద గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు తరలి రావాలని కోరారు. అన్నదాన వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పాత్రికేయుని మృతికి పలువురు సంతాపం
శాంతీపురం, జనవరి 16: మండల పరిధిలోని మఠం గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఆనంద్ మంగళవారం మృతి చెందాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో భాదపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎంపిపి పుష్ప, జడ్పిటిసి శకుంతల, మండల టిడిపి అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, వైస్ ఎంపిపి ఉదయ్‌కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణరెడ్డి, వైకాపా నాయకులు నారాయణరెడ్డి, ఎవి జయరాంలు సంతాపం పకటించిన వారిలో ఉన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.