చిత్తూరు

ఆత్మీయ పలకరింపులతో ఉత్సాహంగా జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, జనవరి 16: మహిళల అశీర్వచనాలు గ్రామాల్లో కార్యకర్తలు, అభిమానుల ఘన స్వాగతాలు చిన్నపిల్లల సెల్ఫీలతో జగన్ మహాసంకల్ప పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది. రామచంద్రాపురం మండలం పారకాల్వలో సోమవారం బసచేసిన పాదయాత్ర మంగళవారం నగరి నియోజక వర్గం వడమాలపేట మండలానికి చేరుకుంది. మండల పరిధిలోని పత్తిపుత్తూరులో ఎమ్మెల్యే రోజా, స్థానిక సర్పంచ్ ప్రతిమ, ఎపీపీ మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు సురేష్‌కుమార్, నాయకులు సుబ్రహ్మణ్యంరెడ్డిల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. జన్మభూమి కమిటీల పేరుతో రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు రావడం లేదని, మీరు సీఎం అయి న్యాయం చేయాలని స్థానికులు విన్నవించారు. పూడిక్రాస్ రోడ్డు వద్ద రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ రైతులు చెంగారెడ్డి ఆధ్వర్యంలో తమ కష్టాలను జగన్‌కు విన్నవించుకొన్నారు. తరువాత అప్పలాయగుంట, ఎనమలపాళెం, తిరుమణ్యంలలో పాదయాత్ర నిర్వహిస్తూ సమీపంలో మధ్యాహ్న భోజనం చేశారు. వేమాపురం, గొల్లకండ్రిగ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగిస్తూ వడమాలలో వైసీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం వడమాలపేటలో మహాసంకల్ప పాదయాత్రలో భాగంగా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను అండగడుతూ భవిష్యత్‌లో రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరగాలంటే వైసీపీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, జిల్లా రైతాంగానికి నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదని, జిల్లాకు చుక్కనీరు కూడా తేలేకపోయారని ఆరోపించారు. బహిరంగ సభ అనంతరం పాదిరేడు సమీపంలో బసచేశారు. నియోజక వర్గంలోని నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు మండలాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీ్ధర్‌రాజు, లక్ష్మీపతిరాజు, వీళుమలై, చక్రపాణిరెడ్డి, దిలీప్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామకృష్ణమరాజు, మండల కన్వీనర్ సదాశివయ్య, జిల్లా వైసీపీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం యాదవ్, రేణుక, సుధీర్‌రెడ్డి, మధు మోహన్‌రెడ్డి, తులసిరామిరెడ్డి, యాదవేంద్ర, ఉమాపతి, మహేష్‌రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు వస్త్రాలు పంపిణీ
తిరుపతి, జనవరి 16: కనుమ పండుగను పురస్కరించుకుని మంగళవారం శ్రీ వేంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలం పాడిపేట గోవిందపురం వద్ద పేదలకు అన్నదానం, వస్తద్రానం చేశారు. తిరుచానూరు మాజీ సర్పంచ్ సి ఆర్ రాజన్ ఈకార్యక్రమాన్ని ప్రారంభించి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈసందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్.చక్రపాణి మాట్లాడుతూ 2008లో ట్రస్ట్‌ప్రారంభించినప్పటి నుంచి పేదలకు పండుగల రోజుల్లో అన్నదానం, వస్తద్రానం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి దగ్గర విరాళాలు స్వీకరించకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భగవంతుని దయతో ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి చంద్రకళ, కోశాధికారి ఎన్.లక్ష్మికిరణ్, విజయ, వసంత, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.