చిత్తూరు

అభివృద్ధి పనులు ప్రారంభించిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 16: మండలంలోని కందులవారి పల్లె గ్రామ పంచాయతీ, నారావారి పల్లెలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ వౌళిక సదుపాయాలు అభివృద్ధి సంస్థచే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రూ.6.08కోట్లతో వౌలిక వసతులతో నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నారావారి పల్లెకు చేరుకున్న సి ఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నారావారి పల్లె నుంచి బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన నారావారి పల్లెలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సి ఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఆస్పత్రిలోని వార్డులను, వౌలిక వసతులను, అత్యవసర చికిత్స, ఆపరేషన్ థియేటర్, ఓపి, మెడికల్ స్టోర్ రూమ్, డాక్టర్ రూమ్, స్ర్తి, పురుషుల వార్డులను సిఎం పరిశీలించారు. ఏపిఎంఎస్‌ఐడిసి త్వరగా పూర్తి చేసినందుకు ఈఈ నగేష్‌ను ఆయన సిబ్బందిని అభినందించారు. ఈకార్యక్రమంలోరాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారాలోకేష్, జడ్పీ చైర్మన్ గీర్వాణి, చిత్తూరు ఎంపి శివప్రసాద్, ఎమ్మెల్సీ రాజసింహులు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సర్పంచ్ చంద్రకుమార్ నాయుడు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా, డిఐజి ప్రభాకర్‌రావు, ఎస్పీ అభిషేక్ మహంతి, తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ హరికిరణ్, తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, ఏపి వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ విజయగౌరి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ సరలమ్మ, అస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వినతుల స్వీకరణ
నారావారి పల్లి నుంచి టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వద్దకు వెళ్ళిన సి ఎం చంద్రబాబు నాయుడు వారిని ఆప్యాయంగా పలుకరించి వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలను తీసుకుని పరిశీలించారు. వాటిని జిల్లా యంత్రాంగానికి అందజేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
రూ.50వేలు ఆర్థిక సాయం అందించిన సి ఎం
సోమవారం ముఖ్యమంత్రికి ఆర్థిక సాయం కోసం అర్జీ లిచ్చిన వారిలో వారి దైనందిన పరిస్థితిని ముఖ్యమంత్రి అర్థం చేసుకుని అనారోగ్యంతో బాధపడుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన ఆర్.రెడ్డెప్పకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.50వేలు అందించారు. అలాగే ఐరాల మండలం, పొలకలకు చెందిన పి.వెంకటరమణ నాయుడుకి పింఛను, తిరుపతికి చెందిన కె.్ధనలక్ష్మి, వి.పుష్పలత, జి.శకుంతలమ్మలకు గృహాలను మంజూరు చేశారు.