చిత్తూరు

అమరావతి నుంచి చిత్తూరుకు రోడ్డు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జనవరి 16:అమరావతి నుంచి చిత్తూరుకు సులభమైన రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13 నుంచి నాలుగు రోజులపాటు తన స్వగ్రామం నారావారి పల్లెలో వేడుకలు జరుపుకుని, మంగళవారం మధ్యాహ్నం టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడారు. రోడ్ల విస్తరణ కూడా ఒక ప్రణాళిక బద్ధంగా చేస్తున్నట్లు సి ఎం వివరించారు. రంగంపేట, పుదిపట్ల బైలు రోడ్డు విస్తరణతోపాటు 4లైన్ల నిర్మాణానికి 22కి.మీలకు రూ.57 కోట్లు అంచనాతో శంకుస్థాపన చేశామన్నారు. అలాగే పూతలపట్టు-నాయుడుపేట 6 లైన్ల రహదారికి, బెంగళూరు-చిత్తూరు-క్రిష్ణగిరి, పలమనేరు-మదనపల్లి, చిత్తూరు-రాణిపేట రహదారుల విస్తరణతో చిత్తూరు జిల్లా కేంద్రానికి మంచి అత్యాధునిక రహదారులు అనుసంధానం అవుతుందన్నారు. హంద్రి-నీవా పుట్టపర్తి వద్ద చిన్న సమస్య వల్ల ఆలస్యమైందని త్వరలో వాటిని అధిగమించి మొదటి మదనపల్లికి, తరువాత పుంగనూరు, పలమనేరు, కుప్పంకు తాగునీరు, సాగునీరు అందిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అదే సమయంలో మదనపల్లి నుంచి శ్రీనివాసపురం తీసుకువచ్చి పీలేరు నియోజక వర్గ పరిధిలోవున్న వాల్మీకి పురం,అక్కడ నుంచి చంద్రగిరి, అక్కడ నుంచి చిత్తూరుకు నీళ్లు తీసుకువెళ్తాయన్నారు. ఈ ఏడాదికే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు. అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్‌లు కూడ నిర్మించి అన్ని చెరువులకు నీరును అందిస్తామన్నారు. మరోవైపు గాలేరు-నగరికి సంబంధించిన మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌ను పూర్తి చేసి సోమశిల, స్వర్ణముఖి ద్వారా కూడా నీటిని పిచ్చాటూరు వరకు తీసుకు వస్తామన్నారు. తద్వారా అన్ని రిజర్వాయర్లకు నీరు వస్తుందని, ఈక్రమంలో కరువురహిత జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మదనపల్లి టమోటా హబ్‌గా మారనున్నదని, ఏషియాలో ఇంతపెద్ద మార్కెట్ ఎక్కడాలేదని చెప్పారు. ఒకప్పుడు మంచుతో టమోటా పంట వచ్చేదన్నారు. ఇప్పుడు నీరుకూడా అందిస్తే నాణ్యమైన టమోటో రైతుకు అందుతుందన్నారు. అవసరమైతే ఏడాదికి రెండు మూడు పంటలు కూడా వేసుకునే అవకాశం ఉందని, మార్కెట్ సమస్యల ఉండదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు జపాన్‌లోని అతి పెద్ద కంపినీ తమతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిందని సి ఎం చెప్పారు. ఇక మామిడి కూడా మన జిల్లాలో ఉందని పంట ఎక్కువవేస్తే డిమాండ్ తగ్గుతుందన్నారు. అలా జరగకుండా ఉండాలంటే సమతుల్యతను పాటించాల్సి ఉందన్నారు. కూరగాయలకు కుప్పం కేంద్రంగా నిలవనున్నదని సి ఎం వివరించారు. అన్ని వర్గాలను సమతుల్యం చేస్తూ మామిడి, సెరికల్చర్, డైయిరీ, హార్టికల్చర్ వంటివి ప్రాధాన్యతనిస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నంత దేవాలయాలు ఎక్కడాలేదని టూరిస్టు హబ్‌గా రూపుదిద్దుకోనున్నదని తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వ స్వామి, దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి, కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయాలు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల జిల్లా సొంతమన్నారు. తలకొనలో అందమైన జలపాతాలు ఉన్నాయన్నారు. ఇక హార్సీలీహిల్స్ ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఉందన్నారు. వీటన్నింటి ద్వారా జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈక్రమంలో నూరు శాతం ఒడిఎఫ్‌గా మార్చిలోపు మార్చాలని చెప్పానన్నారు. చిత్తూరు జిల్లాలో గ్రామీన పర్యాటక కేంద్రాలుగా మార్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అగ్రికల్చర్ టూరిజం, విలేజ్ టూరిజంను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇక జిల్లాలో పారిశ్రామిక రంగాలను పరిశీలిస్తే శ్రీసిటీ ఒక మైలు రాయి అన్నారు. అక్కడ నుంచి సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, మదనపల్లి, కుప్పం ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందనున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టు చిత్తూరు జిల్లాకు అనుకూలంగా ఉందన్నారు. చిత్తూరు, నెల్లూరు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు-సూళ్లూరుపే,-చెన్నయ్-తిరుపతిలను ట్రైసిటీ ఇండస్ట్రియల్ జోన్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతాయన్నారు. అందుకే స్పెషల్ ఎంప్లామెంట్ జోన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఎందుకంటే తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉందని, నెల్లూరులో విమానాశ్రయం ఏర్పాటుకు టెండర్లు పలిచామని పనులు ప్రారంభం అవుతాయన్నారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారులు కూడా జిల్లాకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అటు చెన్నయ్, ఇటు బాంగుళూరు, మరో వైపు అమరావతికి రోడ్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే రోడ్డును వెంకటగిరికి అనుసంధానం చేసి చిత్తూరుకి రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇది ఎంతో సులభమైన, సౌకర్యవంతమైన మార్గమన్నారు. ఇక ఎక్స్‌ప్రెస్ వే కర్నూలు, కడప, అనంతపురాన్ని ఎలా అనుసంధానంగా ఉందో అందరికి తెలిసిందే అన్నారు. అందులో నుంచి ఒక రోడ్డును వెంకటగిరికి రోడ్డును సమాంతరంగా జాతీయ రహదారిని ఏర్పాటు చేయవచ్చని అన్నారు. అక్కడ నుంచి చిత్తూరు జిల్లా ఏర్పేడుకు రోడ్డును ఏర్పాటు చేస్తే ఒక సౌకర్యవంతమైన మార్గం అవుతుందన్నారు. దీనిని కొంత కాలంక్రితమే నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని ఇప్పటికే 24 గంటల విద్యుత్తు, 100 శాతం గ్యాస్ కనెక్షన్లు, సీసీ రోడ్లు నిర్మాణాలను చేపట్టడం జరిగిందని అన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలను గుర్తించి భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేసి పల్లెల్లో పట్టణ వసతులు కల్పనకు నాంది పలుకుతున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హతలు కల లబ్ధి దారులకు అందించడానికి ప్రజాసాధికార మిత్రను ఏర్పాటు చేసామని ప్రతి 30 కుటుంబాలకు ఒక మిత్ర ఉంటారని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మంత్రులు నారాలోకేష్, కామినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ గీర్వాణి, చిత్తూరు ఎంపి శివప్రసాద్, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్, చిత్తూరు మేయర్ కటారి అనురాధ, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా, జేసీ చంద్రవౌళి, సబ్ కలెక్టర్ నిశాంత్‌కుమార్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

గోవులను పరిరక్షించుకుందాం

తిరుపతి, జనవరి 16: వేదాలు, పురాణాల్లో పేరొక్కన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా సనాతన భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. స్థానిక ఎస్వీ గోసరంక్షణాశాలలో మంగళవారం కనుమ పండగ సందర్భంగా మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈవేడకలకు ముఖ్య అతిధిగా హాజరైన టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన్లు తెలిపారు. పూర్వకాలం నుంచి కనుమ పండగ రోజున గోపూజకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వల్ల పాడి పంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షింగా ఉంటుందని తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలలో 3వేల పశువులు ఉనాన్యని వీటిలో పలు అరుదైన జాతుల గోవులు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు దాతలు రూ.100కోట్లకు పైగా ఎస్వీ గోసరంక్షణట్రస్టుకు విరాళాలు అందించినట్లు చెప్పారు. దేశవాళీ గోవులను అభివృద్ధి చేయాలని, వాటి పంచగవ్య ఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపేందుకు టీటీడీ కృషి చేస్తోందని తెలిపారు. పంచగవ్య ఉత్పత్తుల ద్వారా రైతుల ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలన్నారు. భూమికి హాని చేసే రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులు ఉపయోగించాలని అన్నారు. ప్రభుత్వం సహకారంతో గోసంపదను కాపాడేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ జే ఈ ఓ పోలభాస్కర్ మాట్లాడుతూ హైందవ సంప్రదాయంలో గోవును పూజిస్తే సకల దేవతల పూజా ఫలాలు లభిస్తుందని తెలిపారు. ఆవు నుంచి లభించే పంచగవ్యాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని అన్నారు. టీటీడీ గోశాలల నిర్వహణ ద్వారా గోసంరక్షణ, గో అభివృద్ధికి కృషి జరుగుతోందని వివరించారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ గోశాలలకు ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు మాట్లాడుతూ వేదాల నుంచి గోమాత ఉద్భవించినందున భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశిష్టమైన స్థానం ఉందన్నారు. గోవు తల్లిలాంటిదని, గోవును పూజిస్తే తల్లితండ్రులు, గురువును పూజించినట్లేనని తెలిపారు. గోవు సంతానమైన ఎద్దు పాడిపంటలు పండిచడానికి, రైతులకు అండగా ఉంటుందని తెలియజేశారు. అంతకముందు ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గౌరిపూజ, తులసీపూజల్లో పాల్గొన్న అనంతరం గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతలు సమర్పించి వాటికి దానా అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, విశ్వం టాలెట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్ కె.హరినాధ రెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డి ఈ ఓ రామచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.