చిత్తూరు

రైతు నేత దీక్షను భగ్నం చేసిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 19: రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతు ఉద్యమనేత ఈదల వెంకటాచలంనాయుడు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలను మంగళవారం పోలీసులు భగ్నం చే శారు. గత ఆరు రోజులుగా రైతు సమస్యలపై కలెక్టరేట్ ఎదుట రిలేదీక్ష చేపట్టినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వెంకటాచలంనాయుడు సోమవారం నుంచి కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. జిల్లాలో సహకార చక్కెర ఫ్యాక్టరీతో పాటు డెయిరీని పునర్ ప్రారంభించాలని జిల్లాలో పాలను తిరుమల, తిరుపతి దేవస్థానం కొనుగోలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షను చేపట్టారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. దీంతో రైతు సమస్యలు పరిష్కారం కోసం తన ప్రాణం పోయినా పరవాలేదని వారి కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.