చిత్తూరు

పలమనేరులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, ఫిబ్రవరి 16: మండల పరిధిలో మొరం వద్ద శ్రీ వెంకటేశ్వర హేచరీస్‌కు చెందిన సెప్టిక్ ట్యాంకులో పడి ఏడుగురు మృతి చెందడంతో పలమనేరు పరిసర ప్రాంతాల్లో విషాధ చాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా కొలమాసనపల్లికి చెందిన మొరం వాసులు రెడ్డెప్ప(40), రమేష్(30), రామచంద్ర(23), కేశవ(23), గోవిందస్వామి(45)లు ఈ దుర్ఘటనలో విగతజీవులు కావడంతో ఆ గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో చంద్రగిరికి చెందిన వెంకటరాజు(24), కర్నాటక రాష్ట్రం ముల్‌బాగిల్‌కు చెందిన ఆర్.బాబు మృత్యువాత పడ్డారు. పలు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ హేచరీస్ యాజమాన్యం వైఫల్యమే ఇందుకు కారణమని మృతుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. విషపూరితమైన ఈ ట్యాంకును శుభ్రం చేసే ముందు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. పలు సంఘాల ప్రతినిధులు, వామపక్ష నేతలు, పలు రాజకీయ పార్టీ నేతలు సంఘటనా స్థలానికి చేరుకొని యాజమాన్య వైఖరని నిరసిస్తూ కొంతసేపు ఆందోళన చేపట్టారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తదుపరి పోలీసులు వారికి సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో పలు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడంతో వారి రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. సెప్టిక్ ట్యాంకు నుంచి మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. దీనితో పలమనేరు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మృతుల బంధువులు, సన్నిహితులు తరలి రావడంతో ఆసుపత్రి కిటకిటలాడింది. ఎటు చూసిన రోదనలతో ఆసుపత్రి హోరెత్తింది.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అమరనాథ్‌రెడ్డి
రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి అమరనాథ్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో సెప్టిక్ ట్యాంకులో పడి ఏడుగురు మృతి చెందడంతో విదేశీ పర్యటనలో వున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి సమాచారం తెలుసుకొని వెంటనే ఫోన్ ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు కారణమైన హేచరీస్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, కలెక్టర్
మొరం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఏర్పేడులో ఉన్న కలెక్టర్ ప్రద్యుమ్న హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకు మునుపే జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, అడిషనల్ ఎస్పీ రాధిక, మదనపల్లె సబ్‌కలెక్టర్ వెట్రిశెల్వి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనంతరం ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు లోనైన శివకుమార్, హరికృష్ణలను మెరుగైన వైద్య సేవల కోసం వేలూరు సిఎంసికి తరలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
మృతుల కుటుంబాలకు 25లక్షలు ఎక్స్‌గ్రేషియా
విషవాయువు కారణంగా మృత్యువాతపడ్డ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన జిల్లాకు చెందిన ఆరుగురు కుటుంబాలకు చంద్రన్న బీమా కింద ఐదు లక్షలు, ప్రభుత్వ పరంగా మరో ఐదు లక్షలు, శ్రీ వెంకటేశ్వర హేచరీస్ యాజమాన్యం 15లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. అయితే ఇందులో మృతి చెందిన కర్నాటకకు చెందిన ఆర్.బాబు కుటుంబానికి 20లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందచేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. మృతుల కుటుంబాల పిల్లలకు యాజమాన్యమే విద్యాబోధన కొనసాగించాలని ఆదేశించామన్నారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన నేతలు
పలమనేరు మొరం వద్ద జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్, పలమనేరు కో ఆర్డినేటర్లు సివి కుమార్, టిడిపి నాయకులు జడ్పీటిసి శమంతకమణి, పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ బాలాజీనాయుడు, టీడిపి పట్టణ అధ్యక్షుడు జగదీష్‌నాయుడుతో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు ఓబుల్‌రాజు, రాజశేఖర్ మృతుల కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘ నాయకులతో ఆందోళనకు దిగారు.