చిత్తూరు

వైభవంగా సభాపతి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సభాపతి కల్యాణం వైభవంగా జరిగింది. సభాపతి అంటే నటరాజస్వామి. నటరాజస్వామి చేసే నాట్యవిన్యాసాల్లో కల్యాణం కూడా ఒకటి. అంతేకాకుండా కల్యాణోత్సవాన్ని కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలోని 16 కాళ్ల మండపంలో శివకామసుందరి సమేత నటరాజస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధం తదితర సుగుంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ భ్రమరాంబ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం స్వామి, అమ్మవార్లు రుద్రాక్ష, అంబారీ వాహనాలపైన పురవీధుల్లో ఊరేగారు.