చిత్తూరు

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 18: ఉరుకులు, పరుగులుగా సాగుతున్న నేటి ఆధునిక జీవన విధానంలో శారీరక, మానసిక ఒత్తిడిల నుంచి ఉపశమనం పొందడానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని టీటీడీ సీవీఎస్వో ఆకె రవికృష్ణ ఉద్బోధించారు. ఆదివారం స్థానిక మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు అవసరమైన ఉత్సాహాన్ని క్రీడల ద్వారా పొందవచ్చన్నారు. ఉద్యోగులు తీవ్ర వత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని, దీనిని నుంచి బయటపడి ఉల్లాసాన్ని, ఆనందాన్ని పొందడానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. క్రీడల ద్వారా మనలోని సృజనాత్మకతను వెలికితీసుకురావచ్చని, మహాభారతంలో అర్జునుడు, ఏకలవ్యుడు గురించి తెలియజేశారు. క్రీడల ద్వారా దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లవచ్చని చెప్పారు. ప్రతి రోజు క్రీడలు, వ్యాయామం చేయాలని, ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తి పెరిగితే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా పోటీతత్వం, మానసికంగా ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. అనంతరం టీటీడీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి.రవి మాట్లాడుతూ టీటీడీ 1977 నుంచి ప్రతి సంవత్సరం క్రీడలను నిర్వహిస్తోందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ విచ్చేసే వేలాది మంది భక్తులకు విశేష సేవలందిస్తున్న ఉద్యోగులకు క్రీడలు అవసరమన్నారు. క్రీడల వల్ల మానసిక ఉత్తేజంతో పాటు సంస్థలో మరింత కష్టపడి పనిచేయడానికి దోహదపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు క్రీడలు, సంగీతం అవసరమని తెలిపారు. అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీవీఎస్వో చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఉద్యోగుల్లో మొత్తం 491 మంది ప్రథమ, 491మంది ద్వితీయ, 67 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. మొత్తం వివిధ విభాగాల్లో 1522 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 1023 మంది పురుషులు, 493 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ వార్షిక క్రీడా పోటీల నివేధికను భాస్కర్ వివరించగా, టీటీడీ సంక్షేమాధికారి స్నేహలత, ఎస్ ఈ సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.