చిత్తూరు

25న జిల్లాలో స్పోర్ట్స్ అండ్ ఆడ్వెంచర్ కబ్ల్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 18: జిల్లాలో యువతను సాహసోతమైన క్రీడల వైపు ఆకర్షించేందుకు స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ క్లబ్‌ను ప్రారంభిచనున్నట్లు జిల్లా కెలెక్టర్ ప్రద్యుమ్న, జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబులు తెలిపారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు సచివాలయంలో ఇందుకు సంబంధించిన య్యాప్‌ను వారు లాంఛనంగా ప్రారంభించి , పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా పరిపాలన విభాగం, పోలీసుశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్నట్లు వివరించారు. ఈ నెల 25 వ తేది ఉదయం స్పోర్ట్స్ అండ్ ఆడ్వెంచర్ క్లబ్ ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన అడ్వెంచర్ య్యాప్‌ను కూడా రూపొందించినట్లు చెప్పారు. ప్రధానంగా యువత ఇతర వ్యాపకాలపట్ల ఆక్షణకు లోను కాకుండా, ఆరోగ్యం కాపాడు కోవడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొనే విధంగా తీర్చి దిద్ధాలన్నదే దీని ముఖ్య ఉద్ద్యేశమన్నారు. ఆసక్తి గల యువకులు గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆడ్వెంచర్ య్యాప్ లేక సీ పీ వో య్యాప్ ద్వారా ఈ క్రీడల్లో పాల్గొన వచ్చుని వివరించారు. స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ క్లబ్ నందు చేరే వారు ముందుగా నిర్ణీత ఫీజు చెల్లించి సభ్యులు సభ్యత్వం పొందాలన్నారు. ఈనగదు చెల్లించిన తరువాత జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి ఆ తరువాత వారికి సభ్యత్వం ఇస్తామన్నారు. ఈ క్లబ్ ప్రారంభమైన తరువాత జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో అనేక సాహసోపేతమైన క్రీడలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ట్రెక్కింగ్ , నైట్ క్యాంపింగ్ , సైక్లింగ్ , మారథాన్ , ట్రైసర్ హంట్ , ఫైరింగ్ ,కేవింగ్ , నైట్ రౌండ్స్, స్పోర్ట్స్, అడ్వెంచర్ అక్టివిటీస్ కొంబో తదితర రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం కలెక్టర్ , ఎస్పీ , ఏ ఎస్పీ , ఇతర పోలీసు అధికారులు , టారిజం , క్రీడలు, అటవీశాఖల అధికారులతో జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఏ ఎస్పీ రాధిక, డీ ఎస్పీలు సుబ్బారావు, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.