చిత్తూరు

స్విమ్స్‌లో కిడ్నీవ్యాధిగ్రస్తుల ప్రాణాలు తీస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: స్విమ్స్‌లో అధికారులు అనుసరిస్తున్న విధానాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపిస్తూ స్విమ్స్ రోగుల పరిరక్షణ కమిటీ నేతలు నవీన్‌కుమార్‌ఱెడ్డి, పురుషోత్తంరెడ్డి, శ్రీదేవి, మురళి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ స్విమ్స్‌లో రోగుల ప్రాణాలు తీసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, మందుల నుండి వైద్యసేవల వరకు అన్ని రకాలుగా కూడా రోగులను ఇబ్బందులు పాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సమయంలో ఒక కిట్‌ను ఒకరికే వినియోగించాలనే నిబంధన ఉందన్నారు. ఈ డయాలసిస్ నిర్వహించే బాధ్యతను తీసుకున్న నెఫ్రోప్లస్ అనే సంస్థ ఒక కిట్‌ను ఇద్దరు రోగులకు వినియోగిస్తుండటంతో, రోగులకు ఇన్‌ఫెక్షన్ సోకి మరణిస్తున్నారన్నారు. అయినప్పటికి కూడా స్విమ్స్ డైరెక్టర్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్విమ్స్‌లో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఆసుపత్రిలో పేద మూర్ఛ రోగులకు స్విమ్స్‌లో ఉచిత మందులను అందించే వారన్నారు. కొన్ని నెలలుగా వాటిని నిలిపివేశారన్నారు. దీంతో మూర్ఛవ్యాధితో ఉన్న రోగులు మందులు కొనుగోలు చేయలేక ఆర్థికభారంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇలాంటి వారందరికీ ఉచితంగా మందులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించి మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఒకే కిట్ వినియోగించేలా నిబంధన ఉందని, ఈ విషయంపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని చెప్పారు. దీంతో ఆందోళన కారులు శాంతించారు.